Bangladesh Crisis | సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలపై భగ్గమన్న అనురాగ్ ఠాకూర్
Bangladesh Crisis : బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరగవచ్చని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన ప్రకటనపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.
Bangladesh Crisis : బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరగవచ్చని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన ప్రకటనపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. వరుసగా మూడుసార్లు ఓటమిపాలవడంతో దేశంలో అరాచకం సృష్టించాలని కాంగ్రెస్ కోరుకుంటోందని దుయ్యబట్టారు. దేశాన్ని తమ గుప్పిటలోకి తీసుకునేందుకు కాంగ్రెస్ ఏం చేసేందుకైనా వెనుకాడదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల ప్రకటనలు ఆ పార్టీ మనస్తత్వాన్ని వెల్లడిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
సల్మాన్ ఖుర్షీద్ ప్రకటనతో మీరు ఏకీభవిస్తారా అని తాను కాంగ్రెస్ నేతలను అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. కాగా బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడుకుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో సైతం బంగ్లాదేశ్ తరహా హింసాత్మక నిరసనలు చెలరేగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ ఖుర్షీద్ భారత్లో అంతా బాగానే కనిపిస్తున్నా బంగ్లాదేశ్ మాదిరి హింసాత్మక నిరసనలు తలెత్తే అస్కారం ఉందని ఆయన హెచ్చరించారు.
కశ్మీర్లోనూ, ఇక్కడ అంతా సవ్యంగానే ఉందని అనిపించినా, కానీ, క్షేత్రస్ధాయిలో పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయని చెప్పారు. నిరంకుశ, నియంత పోకడలు పెచ్చరిల్లితే ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుందని అది బంగ్లా పరిణామాలకు దారితీస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత హెచ్చరించారు. సీఏఏ-ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశ రాజధాని షాహిన్ బాగ్లో జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయాన్ని సల్మాన్ ఖుర్షీద్ గుర్తు చేశారు.
Read More :
Rishab Shetty | 24 ఏండ్ల నిరీక్షణ.. కాంతార హీరో రిషబ్ శెట్టి కల నెలవేరిన వేళ..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

