Danish Kaneria | పెహల్గామ్లో ఉగ్రదాడిపై (Pahalgam Terror Attack) పాకిస్థాన్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని (Pak Deputy PM) ఇషాక్ దార్ (Ishaq Dar) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదుల్ని ‘స్వాతంత్య్ర సమరయోధులు’ (freedom fighters)గా ఆయన అభివర్ణించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) తాజాగా స్పందించారు. ఈ మేరకు ఇషాక్ దార్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
ఉప ప్రధాని వ్యాఖ్యలు ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నామంటూ అంగీకరించినట్లే అని పేర్కొన్నారు. ‘పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్.. ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులు అంటూ సంబోధించారు. ఇది అవమానకరమైనది. అంతేకాదు.. ఉగ్రవాదానికి మేం మద్దతిస్తున్నాం, ప్రోత్సహిస్తున్నామంటూ బహిరంగంగా అంగీకరించడమే’ అని అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. కనేరియా పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అంతకు ముందు పాక్ ప్రధానిపై కనేరియా నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. కశ్మీర్ పెహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడిని ఎక్స్‌లో తీవ్రంగా ఖండించిన కనేరియా పాక్ ప్రధానిపై నిప్పులు చెరిగారు. ‘పెహల్గామ్ దాడిలో పాకిస్థాన్ ప్రమేయం లేకుంటే ప్రధాని షెషబాజ్ షరీఫ్ ఎందుకు ఖండించలేదు. ఈ ఘటనపై ఎందుకు మౌనంగా ఉన్నారు. సరిహదుల్లో భద్రతా బలగాలను ఎందుకు అప్రమత్తం చేశారు. నిజమేంటో మీకు తెలుసు. ఉగ్రవాదులను మీరు పెంచి పోషిస్తున్నారు’ అని అన్నారు.
Also Read..
Danish Kaneria | ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాక్ ప్రధాని: మాజీ క్రికెటర్ దానిశ్ కనేరియా
NeerajChopra: పాక్ అథ్లెట్ హర్షద్ నదీమ్‌కు ఆహ్వానం.. వివాదంపై వివరణ ఇచ్చిన నీరజ్ చోప్రా