న్యూఢిల్లీ: జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ మెడల్ విజేత నీరజ్ చోప్రా(Neeraj Chopra) క్లారిటీ ఇచ్చారు. బెంగుళూరులో జరిగే ఈవెంట్‌కు పాకిస్థాన్ జావెల్ త్రోయర్ హర్షద్ నదీమ్‌ను ఆహ్వానించిన ఘటనపై స్పందించారు. కశ్మీర్లో ఉగ్రదాడి జరగడానికి ముందు తాను ఆ ఆహ్వానం పంపినట్లు నీరజ్ తెలిపాడు. నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ త్రో ఈవెంట్‌కు రావాలని నదీమ్‌కు ఆహ్వానం పంపారు. కానీ ఆహ్వానం పంపిన రెండు రోజుల వ్యవధిలోనే ఉగ్రవాదులు కశ్మీర్లో దాడికి పాల్పడ్డారు. దీంతో నీరజ్ చోప్రాపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక సోషల్ మీడియాలో నీరజ్ ఫ్యామిలీపైన కూడా ట్రోల్స్ మొదలయ్యాయి.
ఎన్సీ క్లాసిక్ ఈవెంట్ ద్వారా ఉత్తమ అథ్లెట్లను ఇండియాకు తీసుకురావాలన్నదే తన ఉద్దేశం అని, వరల్డ్ క్లాస్ స్పోర్టింగ్ ఈవెంట్లను నిర్వహించాలని భావిస్తున్నామని, సోమవారం రోజే అథ్లెట్లకు అందరికీ ఆహ్వానాలు వెళ్లాయని, పెహల్గామ్ దాడికి రెండు రోజుల ముందే ఆహ్వానాలు పంపినట్లు నీరజ్ తన ఎక్స్ అకౌంట్లో చెప్పాడు. ఉగ్రదాడి ఘటన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు.. తమ కుటుంబాన్ని బాధించినట్లు చెప్పాడు. దేశ గౌరవాన్ని ఉన్నత స్థాయికి చేర్చిన తనకు ఇప్పుడు సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తోందని, తన కుటుంబాన్ని టార్గెట్ చేయడం నిరుత్సాహానికి గురి చేస్తున్నదని, మేం చాలా సాధారణ వ్యక్తులమని, మరో విధంగా తమను చిత్రీకరించవద్దు అని నీరజ్ చోప్రా తెలిపాడు.
తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియాను నీరజ్ తప్పుపట్టాడు. తన మౌనాన్ని అంగీకరంగా భావించరాదు అని, ఒకప్పుడు తన తల్లిని పొగిడిన వాళ్లే ఇప్పుడు విమర్శిస్తున్నారని పేర్కొన్నాడు. దేశం గర్వించే విధంగా, ప్రపంచం గుర్తించే విధంగా మరింత కఠినంగా పనిచేయనున్నట్లు చెప్పారు.
నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్‌ను మే 24వ తేదీన బెంగుళూరులో నిర్వహించనున్నారు. అయితే ఆ టోర్నీలో పాల్గొనడం లేదని పాక్ అథ్లెట్ హర్షద్ నదీమ్ స్పష్టం చేశారు. ఏషియన్ చాంపియన్‌షిప్ కోసం శిక్షణా కార్యక్రమంలో పాల్గొనున్నట్లు చెప్పారు. మే 27 నుంచి 31 వరకు జరిగే ఏషియన్ చాంపియన్‌షిప్‌లో నదీమ్ పాల్గొననున్నాడు. దీని కోసం ఆయన మే 22వ తేదీన దక్షిణ కొరియా వెళ్లనున్నాడు.
— Neeraj Chopra (@Neeraj_chopra1) April 25, 2025