Danish Kaneria | న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్నారని ఆ దేశ మాజీ క్రికెటర్ దానిశ్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని ఎక్స్‌లో తీవ్రంగా ఖండించిన కనేరియా పాక్ ప్రధానిపై నిప్పులు చెరిగాడు.
‘పహల్గాం దాడిలో పాకిస్థాన్ ప్రమేయం లేకుంటే ప్రధాని షెషబాజ్ షరీఫ్ ఎందుకు ఖండించలేదు. సరిహదుల్లో భద్రతా బలగాలను ఎందుకు అప్రమత్తం చేశారు. నిజమేంటో మీకు తెలుసు. ఉగ్రవాదులను మీరు పెంచి పోషిస్తున్నారు అని అన్నాడు.