IPL 2025 : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్యాట్ కమిన్స్(12-3) నిప్పులు చెరుగుతున్నాడు. పేస్‌తో రెచ్చిపోతున్న కమిన్స్.. మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఢిల్లీ క్యాపిటల్స్‌ను గట్టి దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ కరుణ్ నాయర్(0) వికెట్ తీసిన కమిన్స్ ఆరెంజ్ ఆర్మీకి అదిరే బ్రేకిచ్చాడు. ఆ తర్వాత తన రెండో ఓవర్ తొలి బంతికే ఫాఫ్ డూప్లెసిస్(3) ఇన్ స్వింగర్‌తో బోల్తా కొట్టించాడు.
షాక్‌లో ఉండిపోయిన ఢిల్లీని మరింత కష్టాల్లోకి నెడుతూ మూడో ఓవర్ మొదటి బంతికే అభిషేక్ పొరెల్ (8) వికెట్ సాధించాడు సన్‌రైజర్స్ సారథి. అనంతరం ధాటిగా ఆడాలనుకున్న అక్షర్ పటేల్(6)ను హర్షల్ పటేల్ ఔట్ చేసి ఢిల్లీని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్(10), ట్రిస్టన్ స్టబ్స్(1) క్రీజులో ఉన్నారు. 7 ఓవర్లకు ఢిల్లీ స్కోర్.. 29- 4.
You say duo, we hear Pat 🤝 Ishan 😍
Pat Cummins | Ishan Kishan | #PlayWithFire | #SRHvDC | #TATAIPL2025 pic.twitter.com/xt2atphFZt
— SunRisers Hyderabad (@SunRisers) May 5, 2025
పద్దనిమిదో సీజన్లో పెద్దగా ప్రభావం చూపని కమిన్స్ ఢిల్లీపై మాత్రం చెలరేగుతున్నాడు. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న అతడు డేంజరస్ ఓపెనర్ కరుణ్ నాయర్‌ను ఔట్ చేశాడు. ఔట్ సైడ్ వేసిన బంతిని ఆడిన కరుణ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ క్యాచ్ అందుకున్నాడు.
No better way to begin 🫡#SRH skipper Pat Cummins’ ruthless performance rattles #DC‘s top-order 💪
DC are 26/4 at the end of the powerplay.
Updates ▶ https://t.co/1MkIwk4VNE#TATAIPL | #SRHvDC | @SunRisers pic.twitter.com/8q3Aruxj5q
— IndianPremierLeague (@IPL) May 5, 2025
దాంతో, తొలి బంతికే వికెట్ తీసిన హైదరాబాద్ నాలుగో పేసర్‌గా రికార్డు లిఖించాడు. 2022లో జగదీశ్ సుచిత్ మొదటి బంతికే ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీని ఔట్ చేశాడు. భువనేశ్వర్ 2023లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను వెనక్కి పంపాడు. 18వ ఎడిషన్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌పై షమీ ఈ ఫీట్ సాధించాడు. చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ షేక్ రషీద్‌ను పెవిలియన్ పంపాడు.