IPL 2025 : ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఉప్పల్ మైదానంలో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ సాధించాడు. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కరుణ్ నాయర్(Karun Nair) వికెట్ తీసిన కమిన్స్ ఆరెంజ్ ఆర్మీకి అదిరే బ్రేకిచ్చాడు. మొత్తంగా హైదరాబాద్ జట్టు తరఫున మొదటి బంతికే వికెట్ పడగొట్టిన నాలుగో బౌలర్‌గా కమిన్స్ రికార్డు సృష్టించాడు. అతడి కంటే ముందు జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలు ఈ ఘనత సొంతం చేసుకున్నారు.
పద్దెనిమిదో సీజన్లో పెద్దగా ప్రభావం చూపని కమిన్స్ ఢిల్లీపై మాత్రం చెలరేగుతున్నాడు. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న అతడు డేంజరస్ ఓపెనర్ కరుణ్ నాయర్‌ను ఔట్ చేశాడు. ఔట్ సైడ్ వేసిన బంతిని ఆడిన కరుణ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో, తొలి బంతికే వికెట్ తీసిన హైదరాబాద్ నాలుగో పేసర్‌గా రికార్డు లిఖించాడు.
Lightning doesn’t strike twice, but Pat does ⚡😉
Pat Cummins | #PlayWithFire | #SRHvDC | #TATAIPL2025 pic.twitter.com/QBmSKW5HRt
— SunRisers Hyderabad (@SunRisers) May 5, 2025
జగదీశ్ సుచిత్ 2022లో మొదటి బంతికే ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీని ఔట్ చేశాడు. భువనేశ్వర్ 2023లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను వెనక్కి పంపాడు. 18వ ఎడిషన్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌పై షమీ ఈ ఫీట్ సాధించాడు. చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ షేక్ రషీద్‌ను పెవిలియన్ పంపాడు.