CSK vs KKR | ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాళ్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేశారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ ముందు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ధోనీసేన.. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించింది. డుప్లెసిస్ (86*) హాఫ్ సెంచరీతో మెరిశాడు. రుతురాజ్ గైక్వాడ్ (32), రాబిన్ ఉతప్ప (31), మెయిన్ అలీ (37) ఫర్వాలేదనిపించారు. కోల్‌కతా బౌలర్లలో నరైన్ 2 వికెట్లు, మావి ఒక వికెట్ తీశారు.