IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న చెన్నై సూపర్ కింగ్స్(CSK) కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నీ నుంచి నిష్క్రమించిన సారథి రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) స్థానాన్ని భర్తీ చేయనుంది. టాపార్డర్‌లో యువ బ్యాటర్‌కు చోటు కల్పించింది సీఎస్కే. రంజీల్లో ముంబై జట్టుకు ఆడే ఓపెనర్ ఆయుష్ మహత్రే (Ayush Mhatre)ను స్క్వాడ్‌లోకి తీసుకుంది. దాంతో, సూపర్ కింగ్స్ స్క్వాడ్‌లో పృథ్వీ షా(Prithvi Shaw) భాగం కానున్నాడనే వార్తలకు చెక్ పడింది.
‘ఎడమ మోచేతి గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించిన కెప్టెన్ రుతురాజ్ స్థానంలో ఆయుష్‌ను తీసుకున్నాం. రంజీల్లో పరుగుల వరద పారిస్తున్న ఈ యువకెరటం రెండు రోజుల్లోని ముంబైలో మా స్క్వాడ్‌తో కలుస్తాడు’ అని సీఎస్కే యాజమాన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
17-year-old Mumbai opener Ayush Mhatre has been roped in as a replacement for CSK skipper Ruturaj Gaikwad, who is injured and ruled out of the season 💛🙌#IPL2025 #AyushMhatre #CSK #Sportskeeda pic.twitter.com/joOW0x5Fkb
— Sportskeeda (@Sportskeeda) April 13, 2025
నిరుడు అక్టోబర్‌లో ముంబై జట్టు తరఫున దేశవాళీ క్రికెట్లో అరంగేట్రం చేశాడు ఆయుష్. వచ్చీ రాగానే తన సత్తా చాటుతూ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ముంబైకి కొండంత ఆస్తిగా మారాడీ యంగ్‌స్టర్. 9 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 504 రన్స్ కొట్టాడీ చిచ్చరపిడిగు. ఇందులో రెండు సెంచరీలు, ఒక అర్ధ శతకం ఉన్నాయి.ఇక సెవెన్ లిస్ట్ ఏలో 458 పరుగులు సాధించాడీ కుర్ర బ్యాటర్. రంజీల్లో ఇరగదీసిన ఈ డాషింగ్ ఓపెనర్.. ఐపీఎల్ 18వ సీజన్ ముందు జరిగిన మెగా వేలంలో రూ.30 లక్షల కనీస ధరకు పేరు రిజిష్టర్ చేసుకున్నాడు. కానీ, అప్పుడు అతడిని ఏ ఫ్రాంచైజీ కొనేందుకు ఆసక్తి చూపించలేదు.
THE NEW SUPER KING OF CSK – Ayush Mhatre 💛
– He is just 17 years old, from Mumbai. pic.twitter.com/iXCcwZEQgP
— Johns. (@CricCrazyJohns) April 14, 2025
చెన్నై విషయానికొస్తే.. ఈ ఎడిషన్‌లో ఆ జట్టు ఆట పసికూనను తలపిస్తోంది. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన మాజీ ఛాంపియన్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కెప్టెన్ రుతురాజ్ అనూహ్యంగా వైదొలగడంతో టాపార్డర్‌లో ధాటిగా ఆడగల బ్యాటర్ కొరత ఏర్పడింది. అందుకే.. గైక్వాడ్ స్థానాన్ని పరుగుల ఆకలితో ఉన్న ఆయుష్‌తో భర్తీ చేయాలని నిర్ణయించుకుంది. గైక్వాడ్ మోచేతికి గాయంతో ఎంఎస్ ధోనీ(MS Dhoni) మళ్లీ పగ్గాలు చేపట్టాడు. ఏప్రిల్ 14, సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో చెన్నై తలపడనుంది.