కోదాడ, ఏప్రిల్ 14 : విశ్వ జనీనమానవుడు, రాజ్యాంగ రచన సంఘం అధ్యక్షుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆకాంక్షకు అనుగుణంగానే ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కోదాడలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న రాష్ట్రాలతోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని అంబేద్కర్ ప్రవచించారని, ఆయన ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ అన్ని రంగాల్లో రికార్డు స్థాయిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సముచిత స్థానంలో నిలబెట్టారని కొనియాడారు. గత కేసీఅర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెలంగాణ సెక్రటేరియట్ వద్ద 150 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసి, తెలంగాణ సెక్రటేరియట్ కు ఆ మహానుభావుడి పేరును పెట్టి గౌరవిస్తే, ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన విగ్రహానికి తాళాలు వేసి అవమానించిందన్నారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ది చెప్పడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నయీమ్, నాయకులు పయిడిమర్రి సత్యబాబు, సంపెట ఉపేందర్ గౌడ్, సంగిశెట్టి గోపాల్, ఎం.డీ.ఇమ్రాన్ ఖాన్, కర్ల సుందర్ బాబు, షేక్ అబ్బుబకర్, షేక్ ఆరీఫ్, బచ్చలికూరి నాగరాజు, కాసాని మల్లయ్య గౌడ్, బొర్ర వంశీనానీ, మాదాల ఉపేందర్ యాదవ్, గంధం ఉపేందర్ యాదవ్, నర్సిరెడ్డి, జాని, బుచ్చిబాబు, గొర్రె రాజేశ్, గంధం శ్రీను, అన్నెపాక కోటేశ్, సిద్దెల రాంబాబు, అప్పికట్ల ఉపేందర్, గుండె రాజేశ్, అభి, కలకొండ వెంకటనారాయణ, కుడుముల సైదులు, పంది లక్ష్మయ్య, షేక్ నిస్సార్, షేక్ దస్తగిరి, షేక్ ఆసిఫ్, సి.హెచ్. బుచ్చారావు, నెమ్మాది వినోద్, సోమపంగు సతీశ్ పాల్గొన్నారు.