లక్నో: వ్యాపారులు ప్రయాణించిన కారును ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అనుసరించారు. ఒక చోట ఆ కారుపై బాంబులు విసిరి పారిపోయారు. (Bikers Throw Bomb On Car) దీంతో కారులో ఉన్న వారు భయాందోళన చెందారు. వెంటనే కారు దిగి అక్కడి నుంచి దూరంగా పరుగులుతీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ సంఘటన జరిగింది. చక్ ఘాట్ ప్రాంతంలో నివసిస్తున్న శుభమ్, వేద్, విక్కీ ఒక పెళ్లికి హాజరయ్యేందుకు కారులో బయలుదేరారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో నారిబారి ప్రాంతంలో ఆ కారు ఆగింది.
కాగా, బైక్‌పై అనుసరిస్తున్న ఇద్దరు దుండగులు ఆ కారుపై బాంబులు విసిరి పారిపోయారు. దీంతో కారులో ఉన్న శుభమ్, వేద్, విక్కీ భయాందోళన చెందారు. వెంటనే కారు నుంచి కిందకు దిగి దూరంగా పరుగెత్తారు. స్వల్పంగా గాయపడిన ఆ ముగ్గురు వ్యక్తులు చికిత్స పొందారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు బాధితులకు ట్రాక్టర్ ఏజెన్సీ ఉందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వివాదం కారణంగా వారిపై బాంబు దాడి జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
उत्तर प्रदेश : जिला प्रयागराज में बाइक सवार बदमाशों ने कार के ऊपर 2 बम फेंक दिए !! pic.twitter.com/p00zIsdvb9
— Sachin Gupta (@SachinGuptaUP) April 14, 2025