IPL 2025 : భారీ ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్(CSK) మరోసారి కష్టాల్లో పడింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల విజృంభణతో పవర్ ప్లేలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. 41 పరుగులకే టాప్ గన్స్ పెవిలియన్ చేరడంతో సీఎస్కే ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా శివం దూబే(12)ను తీసుకుంది. ప్రస్తుతం విజయ్ శంకర్(17) అండగా దూబే జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నాడు. 9 ఓవర్లకు చెన్నై స్కోర్.. 59-3.
తొలి ఓవర్లోనే రిటర్న్ క్యాచ్‌తో రచిన్ రవీంద్ర(3)ను వెనక్కి పంపాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే డెవాన్ కాన్వే(13)ను విప్రజ్ నిగమ్ బోల్తా కొట్టించాడు. ఆ కాసేపటికే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(5) పెద్ద షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకున్నాడు.
Catch that says Vipraj Nigam 🗣️
And the Captain says all mine 😎#CSK 46/3 after 6 overs in the chase
Updates ▶ https://t.co/5jtlxucq9j #TATAIPL | #CSKvDC pic.twitter.com/cnMeAMSLNl
— IndianPremierLeague (@IPL) April 5, 2025
ఐపీఎల్ 18వ సీజన్లో అజేయంగా దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ మూడో మ్యాచ్‌లోనూ భారీ స్కోర్ చేసింది. చెపాక్ స్టేడియంలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(77) దంచికొట్టాడు. యువకెరటం అభిషేక్ పొరెల్(33), కెప్టెన్ అక్షర్ పటేల్(21)లు మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. వీళ్లిద్దరూ త్వరగానే వెనుదిరిగినా మిడిల్ ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను రాహుల్ బెంబేలెత్తించాడు. ఇక ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్(24) ధనాధన్ ఆడాడు. వీళ్లిద్దరి మెరుపులతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.