Hyderabad | కీసర, ఏప్రిల్ 5: ఔటర్ రింగ్ రోడ్డుపై మినీ వ్యాన్ బోల్తా పడింది. అతి వేగంతో వస్తున్న మినీ వ్యాన్ టైర్ అకస్మాత్తుగా పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో మినీ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
పెరుగు, పాల ప్యాకెట్ల లోడ్‌తో హయత్‌నగర్ నుంచి శామీర్‌పేట వైపునకు ఓ మినీ వ్యాన్ శనివారం మధ్యాహ్నం బయల్దేరింది. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని యాద్గార్పల్లి ఔటర్ రింగ్ రోడ్డు మీద వ్యాన్ టైర్ పేలింది. అప్పటికే మినీ వ్యాన్ మితిమీరిన వేగంతో వస్తుండటంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ మహేశ్, వ్యాన్‌లో ఉన్న నూర్ ఆలం అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఓఆర్ఆర్పై వెళ్లే ఇతర వాహనదారుల సమాచారం మేరకు 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా, కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.