BookMyShow | స్టాండ్ అప్ కమెడియన్ కునాల్ కమ్రాకు బుక్‌మైషో షాక్ ఇచ్చింది. కళాకారుల జాబితా నుంచి, టికెటింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి కునాల్ కమ్రా పేరును తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ సందర్భంగా శివసేన నేత బుక్‌మైషో సీఈవో ఆశిష్ హేమరాజనికి కృతజ్ఞతలు తెలిపారు. సీఈవోకు రాసిన లేఖలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన సోషల్ మీడియా ఇన్చార్జి రాహుల్ కనాల్.. కునాల్ కమ్రా షో టికెట్ల అమ్మకాలు, ప్రమోషన్, కళాకారుల జాబితా నుంచి తొలగించినందుకు ధన్యవాదాలు చెప్పారు. శాంతిని కాపాడడం, మా మనోభావాలను గౌరవించారన్నారు. ముంబైకర్లు అన్ని రకాల కళలను ప్రేమిస్తారని, కానీ వ్యక్తిగత ఎజెండాలో కాదన్నారు.
సమస్యను పరిష్కరించడంలో మీ వ్యక్తిగత ప్రమేయం, మార్గదర్శకత్వం అమూల్యమైందన్నారు. బుక్‌మైషో విలువలకు, నిబద్ధతకు అభినందనలు తెలిపారు. ఆశిష్ దృష్టి, నాయకత్వం నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. కునాల్ కమ్రా కొద్దిరోజుల కిందట మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై దేశద్రోహి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాబిటాట్ కామెడీ క్లబ్‌ని ఈ పార్టీ నేతలు షిండే పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు.