ఆదివారం 17 జనవరి 2021
Sports - Jan 03, 2021 , 21:11:13

వరల్డ్‌ రికార్డు...250 మిలియన్ల ఫాలోవర్లు కలిగిన ఏకైక వ్యక్తి ఎవరంటే?

వరల్డ్‌ రికార్డు...250 మిలియన్ల ఫాలోవర్లు కలిగిన ఏకైక వ్యక్తి ఎవరంటే?

న్యూఢిల్లీ:  పోర్చుగల్‌ సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రోనాల్డో సోషల్‌మీడియాలో  అరుదైన ఘనత అందుకున్నాడు. ఫేస్‌బుక్‌ ఆధ్వర్యంలోని సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలోవర్లను కలిగిన తొలి వ్యక్తిగా 35 ఏండ్ల సాకర్ సూపర్‌స్టార్‌ రికార్డు సృష్టించాడు.

ఇన్‌స్టాలో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య 250 మిలియన్లకు పైనే కావడం విశేషం.  హాలీవుడ్‌ సింగర్‌ అరియానా గ్రాండే 213 మిలియన్ల ఫాలోవర్లతో తర్వాతి స్థానంలో ఉంది.  ప్రస్తుతం ఇన్​స్టా అఫీషియల్‌ అకౌంట్‌కు(382 మిలియన్లు ఫాలోవర్లు)  మాత్రమే రొనాల్డో కన్నా ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు.

 2020లో రొనాల్డో పోస్ట్‌ చేసిన ఓ పోస్ట్‌కు  అత్యధికంగా 19.7 మిలియన్ల లైకులు వచ్చాయి. ఈ రికార్డు కూడా తనపేరిటే ఉన్నది.  సాకర్ లెజెండ్ డీగో మారడోనా మృతికి సంతాపం తెలుపుతూ రొనాల్డో  చేసిన   పోస్టుకు గతేడాది ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైక్‌లు వచ్చాయి.