Anjali Tendulkar | భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) సతీమణి అంజలి టెండూల్కర్ (Anjali Tendulkar) కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ముంబై సమీపంలోని విరార్ (Virar) ప్రాంతంలో చాలా తక్కువ ధరకే ఫ్లాట్‌ను కొన్నారు. దాని ధర తెలిస్తే అంతా షాక్ అవుతారు.
రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. అంజలి కొనుగోలు చేసిన ఫ్లాట్ విస్తీర్ణం కేవలం 391 చదరపు అడుగులు మాత్రమే. విరార్‌లోని పెనిన్సులా హైట్స్‌లో ఈ ఫ్లాట్ ఉంది. దీని ధర కేవలం రూ.32 లక్షలు మాత్రమే. ఈ ఏడాది మే 30న అంజలి (Anjali) ఈ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి ఆమె రూ. 1.92 లక్షల మేర స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ఇక రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 30 వేలు చెల్లించినట్లు జాప్కీ.కామ్ వెల్లడించింది. కాగా, స్టార్ సెలబ్రిటీ భార్య ఇంత తక్కువ ధరకు ఫ్లాట్ కొనుగోలు చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
కాగా మహారాష్ట్రలో మహిళలు ఇళ్లను కొనుగోలు చేస్తే పలు రాయితీలు పొందుతారు. మహిళలు ఫ్లాట్లు కొనుగోలు చేస్తే స్టాంపు డ్యూటీ కింద ఒక శాతం రాయితీ ఉంటుంది. దీని ప్రకారం అంజలి కూడా స్టాంప్ డ్యూటీపై 1శాతం రాయితీని పొందారు. అయితే, పట్టణాలు, జిల్లాలను బట్టి ఈ రాయితీ 5 నుంచి 7 శాతం వరకు ఉంటుంది.
Anjali Tendulkar buy 391 sq ft flat in Virar for ₹32 lakh
The deal included a ₹30,000 registration fee, benefiting from a 1% concession as a female buyer in Maharashtra pic.twitter.com/TojBCnoekZ
— India Business News & Updates (@IndiaBuziness) August 22, 2025
Also Read..
Rekha Gupta | దాడి తర్వాత.. తొలిసారి పబ్లిక్ ఈవెంట్లో పాల్గొన్న ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. VIDEO
Baby elephant | పాఠశాలకు వెళ్లిన పిల్ల ఏనుగు.. ఆశ్చర్యానికి గురైన విద్యార్థులు.. VIDEO