Rekha Gupta | ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) రేఖాగుప్తా (Rekha Gupta)పై రెండు రోజుల క్రితం దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత సీఎం తొలిసారి ఓ పబ్లిక్ ఈవెంట్‌కు హాజరయ్యారు. గాంధీనగర్ (Gandhi Nagar)లోని అశోక్ బజార్లో హోల్‌సేల్ రెడీమేడ్ గార్మెంట్స్ డీలర్ల సంఘం (Association of Wholesale Readymade Garments Dealers) నిర్వహించిన పబ్లిక్ ఈవెంట్లో సీఎం పాల్గొన్నారు. ఆగస్టు 20న జరిగిన దాడి తర్వాత సీఎం ఇలా ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | Delhi CM Rekha Gupta attends an event organised by the Association of Wholesale Readymade Garments Dealers in Gandhi Nagar
This is the first time that the CM is attending a public event after she was attacked on August 20. pic.twitter.com/vv8UTMWuWc
— ANI (@ANI) August 22, 2025
ఢిల్లీ సీఎం రేఖాగుప్తా (Rekha Gupta)పై దాడి జరిగిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం అధికారిక నివాసంలో ‘జన్ సున్వాయి’(ప్రజావాణి) కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి.. కొన్ని పేపర్లు అందజేశాడు. హఠాత్తుగా ఆమె చేయి పట్టుకుని తనవైపు లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో సీఎం తలకు స్వల్ప గాయమైంది. అక్కడ ఉన్నవారు అతడిని బంధించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్యాయత్నం కేసు నమోదుచేశారు. నిందితుడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన రాజేశ్‌భాయ్ సకారియా(42)గా గుర్తించారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
సీఎం రేఖాగుప్తాకు భద్రత పెంపు
దాడి ఘటన ఢిల్లీ సీఎం భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఢిల్లీ సీఎం భద్రతను పెంచింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)తో Z-కేటగిరీ (Z category) భద్రతను కల్పించింది. దీంతో ఇవాళ ఉదయం సీఆర్పీఎఫ్ సిబ్బంది సీఎం నివాసానికి చేరుకుంది. సీఎంకు 24 గంటలూ రక్షణ కల్పించేందుకు ముఖ్యమంత్రి నివాసంతోపాటూ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మోహరించారు. సీఆర్‌పీఎఫ్‌తోపాటూ ఢిల్లీ పోలీసులు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ సీఎంకు నిరంతరం రక్షణ కల్పించనున్నారు.
Also Read..
Baby elephant | పాఠశాలకు వెళ్లిన పిల్ల ఏనుగు.. ఆశ్చర్యానికి గురైన విద్యార్థులు.. VIDEO
Kokilaben Ambani | ఆస్పత్రిలో చేరిన ముకేశ్ అంబానీ తల్లి.. ఆందోళనలో ఫ్యామిలీ