Cricket Australia : మహిళా క్రికెటర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హెడ్‌కోచ్ దులీప్ సమరవీర (Dulip Samaraweera) భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అతడి తీరును తీవ్రంగా తప్పుపట్టిన ఆస్ట్రేలియా క్రికెట్(Cricket Australia) 20 ఏండ్ల పాటు నిషేధం విధించింది. మహిళా క్రికెటర్ పట్ల అసభ్యకర ప్రవర్తన కారణంగానే అతడిపై వేటు వేసినట్టు ఆసీస్ బోర్డు తెలిపింది.
ఇకపై తమ బోర్డుకు సంబంధించిన బిగ్‌బాష్ లీగ్‌లో కూడా ఏ పదవి చేపట్టకుండా దులీప్పై ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు ఆసీస్ బోర్డు వెల్లడించింది. ‘దులీప్ సమరవీరపై 20 ఏండ్ల నిషేధం విధిస్తూ క్రమశిక్షణ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. అతడిపై ఫిర్యాదు చేసిన బాధిత క్రికెటర్ ధైర్యాన్ని అభినందిస్తున్నాం అని క్రికెట్ విక్టోరియా చీఫ్ నిక్ కమిన్స్ ఓ ప్రకటనలో అన్నాడు.
Dulip Samaraweera found to have committed a serious breach of CA’s Code of Conduct by engaging in inappropriate behaviour while working at Cricket Victoria.#CricketAustralia #DulipSamaraweera #CricketTwitter pic.twitter.com/6SAbL7UYb1
— InsideSport (@InsideSportIND) September 19, 2024
దులీప్ ఈ ఏడాది మే నెలలో విక్టోరియా మహిళల జట్టు హెడ్‌కోచ్‌గా నియమితులయ్యాడు. కోచ్‌గా ఆటలో మెలకువలు నేర్పాల్సిన అతడు ఓ క్రికెటర్ పట్ల తన వంకర బుద్ది చూపించాడు.దాంతో, సదరు మహిళ ఈ విషయాన్ని ఆసీస్ బోర్డు క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లింది. అంతే.. దులీప్ను ఉపేక్షించకూడదనే నిర్ణయానికి వచ్చిన కమిటీ అతడిపై 20 ఏండ్ల నిషేధం విధించింది. 52 ఏండ్ల దులీప్ లంక తరఫున 7 టెస్టులు, 5 వన్డేలు ఆడాడంతే.