SA vs ZIM : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేత దక్షిణాఫ్రికా (South Africa) జోరు చూపిస్తోంది. డబ్ల్యూటీసీ కొత్త సైకిల్‌ను సూపర్ విక్టరీతో ఆరంభించింది ఆ జట్టు. కొత్త కెప్టెన్ కేశవ్ మహరాజ్ నేతృత్వంలోన సఫారీల ధాటికి జింబాబ్వే చేతులెత్తేసింది. బులయావాలో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన కార్బిన్ బాస్చ్.. నాలుగోరోజు ఐదు వికెట్లతో ఆతిథ్య జట్టును కోలుకోలేని దెబ్బకొట్టాడు. దాంతో, మహరాజ్ టీమ్ 328 పరుగుల తేడాతో జయభేరి మోగించి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో దూసుకెళ్లింది.
సుదీర్ఘ ఫార్మాట్లో దక్షిణాఫ్రికా విజయాలపరంపర కొనసాగుతోంది. లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాను మట్టికరిపించి తొలిసారి ఐసీసీ టోర్నీలో ఛాంపియన్‌గా అవతరించిన సఫారీ జట్టు డబ్ల్యూటీసీ కొత్త సీజన్లోనూ ప్రత్యర్థులను వణికిస్తోంది. జింబాబ్వే గడ్డపై అద్భుత విజయంతో సిరీస్‌లో ముందజం వేసింది దక్షిణాఫ్రికా.
The World Test champions show their might 💪
This is Zimbabwe’s heaviest defeat by runs in men’s Tests!
🔗 https://t.co/VLN3G44tTP pic.twitter.com/BHB1TnceHo
— ESPNcricinfo (@ESPNcricinfo) July 1, 2025
మహరాజ్ సేన నిర్దేశించిన 573 పరుగుల భారీ ఛేదనలో ఆతిథ్య జట్టు బ్యాటర్లు పోరాడినా ఫలితం లేకపోయింది. కార్బిన్ బాస్చ్ నిప్పులు చెరగడంతో 82కే 6 వికెట్లు పడిన వేళ.. వెల్లింగ్టన్ మసకజ్జ(57), కెప్టెన్ క్రెగ్ ఇర్విన్(49) పట్టుదలగా ఆడి సఫారీల సహనాన్ని పరీక్షించారు.
మసకజ్జ(57),క్రెగ్ ఇర్విన్(49)
అయితే.. ఈ జోడీని విడదీసిన బాస్చ్ సఫారీల విజయాన్ని తేలిక చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ ఓవర్లో తనక చివంగ స్టంపౌట్ కావడంతో జింబాబ్చే ఖాతాలో అతిపెద్ద ఓటమి చేరింది. తొలి ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన బాస్చ్.. తమ దేశ దిగ్గజం జాక్వెస్ కలిస్ రికార్డును సమం చేశాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే శతకంతో మెరిసిన 19 ఏళ్ల ప్రిటోరియస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
బులయావోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో సఫారీ బ్యాటర్ల జోరు చూపించారు. తొలి ఇన్నింగ్స్‌లో కుర్రాడు లుహాన్ డ్రే ప్రిటోరియస్(153), ఆల్‌రౌండర్ కార్బిన్ బాస్చ్(100)లు సెంచరీలతో వీరవిహారం చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో వియాన్ మల్డర్(147) మూడంకెల స్కోర్‌తో రెచ్చిపోయాడు. టాపార్డర్ విఫలమైనా సాధికారిక బ్యాటింగ్‌తో అలరించిన మల్డర్ జట్టు భారీ స్కోర్‌కు బాటలు వేశాడు.
🚨 MATCH RESULT 🚨
A commanding victory for our Proteas men to kick off the Test series! 🇿🇦🔥
A dominant display with both bat and ball, showcasing composure, class, and killer instinct. 🏏
Plenty of positives and match-defining moments; an all-around team performance to take… pic.twitter.com/QH3eZpbVIi
— Proteas Men (@ProteasMenCSA) July 1, 2025
అయితే.. వెల్లింగ్టన్ మసకజ్జ(98-4) ధాటికి లోయర్ మిడిలార్డర్, టెయిలెండర్లు డగౌట్ చేరిన వేళ కేశవ్ మహరాజ్(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సఫారీ జట్టు స్కోర్ 350 దాటించాడు. దాంతో, మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 369 పరుగులు చేసి.. ప్రత్యర్థికి కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్(137) సెంచరీతో 251 రన్స్ చేసిన