IPL 2026 : ఐపీఎల్ 19వ సీజన్‌కు ముందు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆరంభ సీజన్లో ఛాంపియన్‌గా నిలిచిన పేరుతోనే సంతృప్తి చెందుతున్న రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తమ స్క్వాడ్‌లో భారీ మార్పులకు సిద్ధమవుతోంది. ఇదే అదను అనుకుంటున్న ఫ్రాంచైజీలు ఏకంగా రాజస్థాన్ బృందంలోని ఆరుగురిని ట్రేడ్ పద్ధితిన తమకు ఇచ్చేయాలని కోరుతున్నాయి. వీళ్లలో సంజూ శాంసన్ (Sanju Samson) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మిగతా ఐదుగురు ఎవరనేది రాజస్థాన్ వెల్లడించలేదు. కానీ, శాంసన్‌ను దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ విశ్వప్రయత్నం చేస్తోందని సమాచారం.
‘మా స్క్వాడ్‌లోని ఆరుగురిని తీసుకొనేందుకు పలు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి. మేము కూడా ఇతర జట్లను మాకు అనువైన ఆటగాళ్లను ట్రేడ్ పద్ధతిన అప్పగించాల్సిందిగా కోరుతున్నాం. త్వరలోనే ముందడుగు పడుతుందనే నమ్మకంతో ఉన్నాం’ అని రాజస్థాన్ ఫ్రాంచైజీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
Sanju Samson to #CSK? @vijaymirror with all the details 👇https://t.co/7IeBHCtKZY#CricketTwitter #IPL pic.twitter.com/3YlC47GHP4
— Cricbuzz (@cricbuzz) July 1, 2025
పద్దెనిమిదో సీజన్ ముగిసిందో లేదో.. రాజస్థాన్‌కు శాంసన్ గుడ్ బై చెబుతాడానే వార్తలు ఊపందుకున్నాయి. మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు మారుతాడని జోరుగా ప్రచారం జరిగింది. సంజూ కూడా సీఎస్కేకు సంబంధించిన పోస్ట్‌లతో నెట్టింట వైరలయ్యాడు. ఈ నేపథ్యంలోనే శాంసన్‌ను తమకు ట్రేడ్ పద్ధితిన ఇచ్చేయాలని రాజస్థాన్‌ను అభ్యర్తిస్తున్నాడు చెన్నై సీఈఓ కాశీ విశ్వనాథన్ (Kasi VIswanathan). ఒకవేళ శాంసన్, ఫ్రాంచైజీ మధ్య ఏకాభిప్రాయం కుదిరితే అతడు తర్వాతి సీజన్లో ఎల్లో జెర్సీతో ఆడడం ఖాయం.
ఎందుకంటే.. రాజస్థాన్‌కు ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) రూపంలో వికెట్ కీపర్, బ్యాటర్ ఉండనే ఉన్నాడు. యువకెరటం రియాన్ పరాగ్ (Riyan Parag) సైతం సారథ్య బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి.. శాంసన్ స్థానంలో మరొకరిని ఎంచుకోవడమే ఉత్తమం అని ఫ్రాంచైజీ భావిస్తోంది. ఇటుచూస్తే.. 45 ఏళ్లకు దగ్గరపడుతున్న ధోనీ మరో ఎడిషన్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. అందుకే.. అతడి స్థానంలో సంజూను తీసుకోవాలనుకుంటోంది సీఎస్కే. అయితే.. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా శాంసన్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. వికెట్ కీపర్లు క్వింటన్ డికాక్, రహ్మనుల్లా గుర్బాజ్‌లను వదిలించు కోవాలనుకుంటున్న ఆ ఫ్రాంచైజీ పవర్ హిట్టరైన ఈ కేరళ క్రికెటర్‌ను పట్టేయాలని వ్యూహలు రచిస్తోంది. ఇతర ప్రాంఛూజీల ఆ తర్వాత ట్రోఫీని ముద్దాడలేకపో
ఐపీఎల్ హిట్టర్లలో ఒకడైన శాంసన్ 2021లో రాజస్థాన్ రాయల్స్ సారథిగా ఎంపికయ్యాడు. అతడి కెప్టెన్సీలో రాజస్థాన్ 2022 ఎడిషన్‌లో ఫైనల్ చేరినా కప్ కొట్టలేకపోయింది. ఆ తర్వాత మాత్రం ప్లే ఆఫ్స్‌కు ముందే ఆ జట్టు కథ ముగిస్తూ వస్తోంది. 18వ సీజన్లోనూ అంతే. సీజన్ ఆరంభంలో గాయం కారణంగా కీలక మ్యాచ్‌లకు దూరమైన శాంసన్.. ఆఖర్లో జట్టులోకి వచ్చాడు.. కానీ, అప్పటికే రాజస్థాన్ ప్లే ఆఫ్స్ ఆశలు అడుగంటాయి. దాంతో, తీవ్ర నిరాశకు గురైన శాంసన్ 19వ సీజన్లో కొత్త జట్టుకు ఆడాలనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
🚨 Chennai Super Kings are interested in signing Sanju Samson 🚨
Is he the ideal successor to MS Dhoni? 🤔
[Via: Cricbuzz] pic.twitter.com/HBfnNvSJq0
— Sport360° (@Sport360) July 1, 2025
‘క్రాసింగ్ ది ఎల్లో లైన్, తమిళ బ్రాక్ గ్రౌండ్ పాటలు, 7 ఏఎం అరివు’తో పాటు ‘టైమ్ టు మూవ్’ అనే పోస్ట్‌లు పెట్టాడు. అవన్నీ గమనిస్తే చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడేందుకు శాంసన్ ఆరాటపడుతున్నాడని తెలుస్తోంది. ఎలాగూ వచ్చే సీజన్లో ధోనీ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్, పవర్ హిట్టర్ అయిన సంజూ సీఎస్కేకు ఎంతో పనికొస్తాడు. సో.. అతడు వస్తానంటే సీఎస్కే కళ్లకు అద్దుకోవడం ఖాయం. అయితే.. 19వ సీజన్ ప్రారంభానికి ముందే శాంసన్ రాజస్థాన్‌కే ఆడుతాడా? పసుపు జెర్సీ వేసుకుంటాడా? అనే విషయంలో స్పష్టత రానుంది.