Hong Kong Open 2024 : హాంకాంగ్ ఓపెన్‌లో భారత షట్లర్లకు ఊహించని షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్‌లో యువకెరటం చిరాగ్ సేన్ (Chirag Sen) క్వాలిఫయింగ్ రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. టైటిల్ వేటలో దూసుకెళ్తున్న మానవ్ చౌదరీ (Manav Choudhary) అనూహ్యంగా క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. ఇక మహిళల విభాగంలోనూ మిశ్రమ ఫలితాలే ఎదురయ్యాయి.
మహిళల డబుల్స్‌లో త్రీసా జాలీ, గాయత్రీ గోపిచంద్ ద్వయం ప్రీ-క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. పాండా సిస్టర్స్ రుతపర్ణ, శ్వేతపర్ణ జోడీ చైనీస్ తైపీ ద్వయం చేతలో కంగు తిన్నది. చిరాగ్ సేన్ 16వ రౌండ్‌ను ధాటిగా మొదలెట్టినా చివరకు ఓటమి పాలయ్యాడు. కెనడాకు చెందిన లాయ్ యిన్ చుంగ్ జోరు ముందు నిలువలేక 12-21, 10-21తో మ్యాచ్ చేజార్చుకున్నాడు. ఇక మానవ్ సైతం కెనడాకే చెందిన షెంగ్ గ్జియావోడాంగ్కు పోటీ ఇవ్వలేకపోయాడు.
చిరాగ్ సేన్
మంగళవారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో త్రీసా, గాయత్రీ జంట ఉక్రెయిన్ జోడీకి చెక్ పెట్టింది. ఆట ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన భారత ద్వయం 21-14, 21-13తో జయభేరి మోగించింది. ఇక చైనీస్ తైపీకి చెందిన సిఎహ్ పీ షాన్, హంగ్ ఎన్ జూ జోడీ 21-11, 21-8తో పాండ్యా సిస్టర్స్‌ను చిత్తుగా ఓడించింది. ఈసారి హాంకాంగ్ ఓపెన్‌లో స్టార్ ఆటగాళ్లు లేకుండానే భారత బృందం బరిలోకి దిగింది. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం చేజార్చుకున్న లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్‌లు విశ్రాంతి తీసుకున్నారు.