China Football : అత్యాశ అనేది ఎంత చేటు చేస్తుందో తెలిసిందే. డబ్బులకు ఆశపడి అడ్డదారులు తొక్కి క్రీడా భవిష్యత్తును నాశనంసుకున్నావాళ్లు ఎందరో. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఫుట్బాల్లో ‘మ్యాచ్ ఫిక్సింగ్'(Match Fixing)కు పాల్ప చేడిన 43 మంది జీవిత కాల నిషేధానికి గురయ్యారు. ఇంతకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నది ఎవరంటే.. చైనా ఫుట్బాల్ సమాఖ్య(China Football Federation). అవును.. నిషేధానికి గురైన వాళ్లలో అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా ఉండడం గమనార్హం.
చైనా ఫుట్బాల్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఆ దేశ ఫుట్బాల్ సమాఖ్య సీరియస్గా తీసుకుంది. ఊరికే చర్యలు తీసుకోవడంలో అర్థం ఉండదని.. మ్యాచ్ ఫిక్సింగ్పై విచారణ చేపట్టింది. చివరకు 120 మ్యాచుల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు చైనా సమాఖ్య దృష్టికి వచ్చింది. 38 మంది ఆటగాళ్లతో పాటు నలుగురు ఫుట్బాల్ అధికారులకు ఆ పాపంలో భాగం ఉందని తేలింది.
దాంతో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ 41 మందిపై జీవిత కాల నిషేధం విధించింది. మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా సస్పెన్షన్కు గురైన వాళ్లలో చైనాకు చెందిన అంతర్జాతీయ ఆటగాళ్లు జిన్ జింగ్డావో, గువో టియన్యు, గు చావోలతో పాటు దక్షిణ కొరియా ప్లేయర్ సన్ జున్ హో కూడా ఉన్నాడు.