Nitin Gadkari | ప్రతి గంటకు 53 ప్రమాదాలు.. 19 మరణాలు..! రోడ్డు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన నితిన్ గడ్కరీ..!
Nitin Gadkari | భారత్‌లో ప్రతి గంటకు 53 ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఇందులో 19 మరణాలు నమోదవుతున్నాయంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రోడ్డు భద్రతపై వాహనాల తయారీ కంపెనీలకు ఆయన కీలక విజ్ఞప్తి చేశారు.
Nitin Gadkari | భారత్‌లో ప్రతి గంటకు 53 ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఇందులో 19 మరణాలు నమోదవుతున్నాయంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రోడ్డు భద్రతపై వాహనాల తయారీ కంపెనీలకు ఆయన కీలక విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాలంలో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. రహదానులపై వాహనదారులు, పాదచారులకు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియాన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) 64వ వార్షిక సదస్సులో కేంద్రమంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడంపై భాగస్వాములు దృష్టి సారించాలని కోరారు. దేశంలో అందరికీ సురక్షితమైన రహదానులను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. డ్రైవర్లు స్థానిక నియమాలు, నిబంధనలపై అవగాహన కలిగి ఉన్నారని, అలాగే వాహనాలు నడపడం, నడపడంలో నైపుణ్యం కలిగి ఉండేలా డ్రైవింగ్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని తయారీదారులను కోరారు. దేశంలో ప్రతి గంటకు 53 ప్రమాదాలు, 19 మరణాలు సంభవిస్తున్నాయని.. ఈ విషయంలో ఒక్కసారి ఆలోచన చేయాలని కోరారు. ప్రమాదాల్లో 45శాతం ద్విచక్ర వాహనాలతో, 20శాతం పాదచారులతోనే జరుగుతున్నాయన్నారు. శిక్షణ పాఠశాలలు ఏర్పాటు చేయగలిగితే డ్రైవర్లకు శిక్షణ ఇవ్వగలమని.. ఇది నిజంగా సానుకూల పరిష్కారం కావచ్చన్నారు.
నాసిరకం రోడ్ల నిర్మాణం, సూచికలపై కేంద్ర రోడ్లు రహదారుల శాఖ దృష్టి సారించిందన్నారు. వాహనాల భద్రతను సైతం నొక్కి చెప్పారు. భారత్ ఎన్‌క్యాప్ ప్రాముఖ్యతను సైతం ఆయన హైలెట్ చేశారు. కస్టమర్లకు సురక్షితమైన వాహనాలను కలిగి ఉండేందుకు తయారీదారుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని భారత్ ఎన్‌క్యాప్ నిర్ధారిస్తుందన్నారు. కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (NCAP) అనేది భారత మార్కెట్లో విక్రయించే వాహనాలకు సొంత క్రాష్ సేఫ్టీ రేటింగ్. ప్రయాణీకుల భద్రత, పిల్లల భద్రత, కారులో అందుబాటులో ఉన్న సేఫ్టీ పరికరాల ఆధారంగా ప్రతి కారు మోడల్‌కు రేటింగ్ ఇస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

