Realme P2 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ పీ2 ప్రో ఫోన్ను ఈ నెల 13న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్ తో వస్తుందని తెలుస్తోంది. 80వాట్ల చార్జింగ్ మద్దతుతోపాటు 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ అమోలెడ్ డిస్ ప్లేతో వస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్, రియల్ మీ ఇండియా వెబ్ సైట్ ల్లో సేల్స్ ప్రారంభం అవుతాయి. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999 పలుకుతుందని భావిస్తున్నారు.
రియల్మీ పీ2 ప్రో ఫోన్ ప్యారట్ గ్రీన్, ఈగల్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఎల్ఈడీ ఫ్లాష్ తోపాటు డ్యుయల్ రేర్ కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5200 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ సెట్ తో వస్తుందని సమాచారం. 2000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ, ఏఐ గేమింగ్ ఐ ప్రొటెక్షన్ ఉంటుందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుందీ ఫోన్.