Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ తుదిజట్టును ప్రకటించే ముందు కనీసం రెండుసార్లు సమీక్షించాలని పీసీబీ చైర్మన్ మోహ్సిన్ ఖన్వీ జాతీయ సెలెక్టర్లను కోరినట్లు తెలుస్తున్నది. ఐసీసీ ఈవెంట్ కోసం సెలెక్టర్లు జట్టును ఖరారు చేసి.. తుది ఆమోదం కోసం పీసీబీ చైర్మన్‌కు పంపగా.. నఖ్వీ తిప్పిపంపుతూ.. బెస్ట్ ప్లేయర్స్‌నే సెలెక్ట్ చేశారా? లేదా? సమీక్షించుకోవాలని సూచించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. చాలా సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్నది. ఈ క్రమంలో ఐసీసీ ఈవెంట్లో ఎలాగైనా గెలిచి.. టైటిల్‌ను నిలబెట్టుకోవాలని పీసీబీ ఆశిస్తున్నది. ఇక చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 19న జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై చిత్తుగా ఓడిపోయింది. ఫిబ్రవరి 23న ఆదివారం కీలక మ్యాచ్‌ను ఆడనున్నది. భారత్‌తో ఢీకొట్టనున్నది. ఇది పాక్‌కు డు ఆర్ డై మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఓడిపోతే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది.
చాంపియన్స్ ట్రోఫీకి సెలెక్టర్లు ఎంపిక చేసిన జట్టు విషయంలో ఆందోళనగా ఉన్న ఆయన.. మూడోసారి మాత్రం చాంపియన్స్ ట్రోఫీకి జట్టుకు ఆమోదముద్ర వేశారు. జట్టు విషయంలో పూర్తిగా బాధ్యతలు వహిస్తామని సెలెక్టర్లు.. టీమ్ మేనేజ్మెంట్కు స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. జాతీయ సెలక్షన్ కమిటీలో జట్టు తాత్కాలిక హెడ్‌కోచ్ ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్, అజార్ అలీ, అలీమ్ దార్, హసన్ చీమా ఉన్నారు. ఓ మీడియా నివేదిక ప్రకారం.. జాతీయ జట్టు సెలెక్టర్లపై పీసీబీ చైర్మన్ నఖ్వీకి ఏమాత్రం నమ్మకం లేదని.. జట్టుపై ఆయనకున్న ఆందోళనను ఇది ప్రతిబింబిస్తుందని ఓ మూలం తెలిపింది. ఏది ఏమైనప్పటికీ న్యూజిలాండ్‌తో జరిగిన ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్టు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది. న్యూజిలాండ్ తొలి మ్యాచ్‌లో పాక్‌ను 60 పరుగుల తేడాతో ఓడించింది.
పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో అట్టడుగున నాలుగో స్థానంలో ఉన్నది. కమ్రాన్ అక్మల్, మహ్మద్ హఫీజ్, వసీం అక్రమ్, వకార్ యూనిస్, బాసిత్ అలీ సహా అనేక మంది దిగ్గజ ఆటగాల్లు పాక్ జట్టు ఆట తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. కివీస్‌పై 321 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. పాకిస్తాన్ జట్టు తొలి పది ఓవర్లలు కేవలం ఓవర్లలో 22 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్ 47.2 ఓవర్లలో పాకిస్తాన్ జట్టు 260 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పాక్ బ్యాటర్లలో కుష్దిల్ షా 69 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. బాబర్ ఆజమ్ 64 పరుగులతో ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. పాక్ బౌలింగ్ సైతం అధ్వాన్నంగానే ఉన్నది. హరీస్ రవుఫ్, షాహిన్ ఆఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్ సహా మిగతా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. న్యూజిలాండ్ బ్యాటర్లు.. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
Champions Trophy | భారత్-బంగ్లా మ్యాచ్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేసిన పీసీబీ..! అసలు ఏం జరిగిందంటే..?
India National Anthem | పాకిస్థాన్‌లో మార్మోగిన భారత జాతీయ గీతం..! సోషల్ మీడియాలో వీడియో వైరల్..!