India National Anthem | పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకున్నది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతున్నది. మ్యాచ్కు ముందు మ్యాచ్లో పాల్గొనే జట్ల జాతీయ గీతాలాపన జరిగే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల క్రికెటర్లు జాతీయ గీతాపాలన కోసం నిల్చున్నారు. ఆస్ట్రేలియా జాతీయ గీతానికి బదులుగా నిర్వాహకులు భారత దేశ జాతీయ గీతాన్ని ప్లే చేశారు. దాంతో స్టేడియంలో అభిమానులంతా కేకలు వేశారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వెంటనే తప్పును గ్రహించిన నిర్వాహకులు భారత జాతీయ గీతాన్ని నిలిపివేసి.. ఆస్ట్రేలియా జాతీయ గీతాన్ని ప్లే చేశారు. అయితే, అప్పటికే భారత జాతీయ గీతంలోని ‘భారత భాగ్య విధాత’ వరకు ప్లే అయ్యింది. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో పాక్పై పలువురు క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ENG vs Australia match mai indian national anthem chala diya vo bhi lahore mai 😭😭😂😂😂 #ENGvsAUS #ChampionsTrophy2025 pic.twitter.com/iOHbe4wj1F
— Manjyot wadhwa (@Manjyot68915803) February 22, 2025
వాస్తవానికి, చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్లో ఆడబోవడం లేదు. హైబ్రిడ్ మోడల్లో దుబాయి వేదికగా ఆడుతున్నది. జాతీయ గీతాలాపన సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన నిర్వాహకులు.. ఒక దేశం జాతీయ గీతానికి బదులు.. మరో జాతీయ గీతం ప్లే చేయడంపై మండిపడుతున్నారు. ఐసీసీ టోర్నీ సమయాల్లో పోటీపడే రెండు జట్ల జాతీయ గీతాలను మ్యాచ్కు ముందు ప్లే చేశారు. టాస్ తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటారు. చాంపియన్స్ ట్రోఫీలో ఇదేం తొలి వివాదం కాదు. గతంలో కూడా ఐసీసీ పరిశీలనలోకి వచ్చాయి. టోర్నీ ప్రారంభానికి ముందు కరాచీలోని నేషనల్ స్టేడియంలో భారత జెండాను ఎగుర వేయలేదు. పోటీపడే అన్ని జెండాలను ఎందుకు ఎగురవేయలేదనే విమర్శలు వచ్చాయి. దీనిపై పీసీబీని ప్రశ్నించగా.. భారత జట్టు పాక్లో పర్యటించడం లేదని.. అందుకు ఆ దేశ జెండాను ఏర్పాటు చేయలేదని పేర్కొంది. ఆ తర్వాత పీసీబీ భారత జెండాను ఎగుర వేసింది.
Indian national anthem in #ENGvsAUS match😂
yeh yeh porki bolte hai hamara andian mazaak kyu udaate hai…#ChampionsTrophy2025 pic.twitter.com/KgSjOkdnLt— sachin gurjar (@SachinGurj91435) February 22, 2025
In a hilarious mix-up during today’s England vs. Australia match, Pakistan decided to give Australia a “surprise warm-up” by playing the Indian national anthem instead of Australia’s! 🎶😂 pic.twitter.com/vrDQKTQmio
— Arun (@oddEEVEN21) February 22, 2025
#ChampionsTrophy2025 #Pakistan
They played Indian national anthem instead of Australian national anthem.
😂😂😂😂 pic.twitter.com/u8Mu1eoi6m
— rhv (@rhvbhat27) February 22, 2025