Champions Trophy | వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) జట్టును ప్రకటించింది. కెప్టెన్ బాధ్యతలను జోస్ బట్లర్‌కు అప్పగించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌కు చోటు దక్కలేదు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో స్టోక్స్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఇక జో రూట్ తిరిగి జట్టులోకి తీసుకున్నది. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు భారత పర్యటన కోసం ఈసీబీ జట్టును ప్రకటించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్ జట్టు భారత్‌లో పర్యటించనున్నది. ఈ సందర్భంగా టీమిండియాతో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నది. ఈ రెండు సిరీస్‌లకు సైతం జోస్ బట్లర్ ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా వ్యవహించనున్నాడు.
చివరిసారిగా 2023 నవంబర్‌లో ప్రపంచకప్‌లో ఆడిన జో రూట్ మళ్లీ వన్డేల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే, టీ20లకు మాత్రం అతని ఈసీబీ పక్కన పెట్టింది. జనవరి 17న ఇంగ్లండ్ జట్టు భారత్‌కు బయల్దేరుతుందని ఈసీబీ తెలిపింది. జనవరి 22 నుంచి టీ20 సిరీస్ మొదలవనున్నది. భారత్-ఇంగ్లండ్ మధ్య జనవరి 22న తొలి టీ20 మ్యాచ్ కోల్‌కతా వేదికగా జరుగనున్నది. 25న రెండో టీ20 చెన్నైలో, 28న మూడో టీ20 రాజ్‌కోట్, జనవరి 31న నాలుగో టీ20 పుణేలో జరుగనున్నది. ఇక చివరి ఐదో టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 2న ముంబయిలో జరుగుతుంది. ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో తొలివన్డే, ఫిబ్రవరి 9న కటక్‌లో రెండో వన్డే, అహ్మదాబాద్‌లో ఫిబ్రవరి 12న మూడో వన్డే మ్యాచ్ జరుగనున్నది.
జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో , సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.
జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.