Jasprit Bumrah | టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తున్నది. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన చివరి టెస్టు సమయంలో బుమ్రా వెన్నునొప్పి బారినపడ్డాడు. ఆ తర్వాత వెంటనే స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లాడు. వచ్చే నెలలో జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడుతాడా? లేదా? అన్న సందేహాలున్నాయి. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీని సందర్శించాలని బుమ్రాకు బీసీసీఐ సూచించింది. చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించనున్నారు. ఆదివారం ఆఖరి రోజు కావడం విశేషం.
ఇప్పటివరకు బుమ్రా వెన్నునొప్పి ఏ స్థాయిలో ఉందన్నది బీసీసీఐ ప్రకటించలేదు. మళ్లీ మైదానంలోకి దిగేందుకు ముందు కనీసం మూడువారాలు రీహాబిలిటేషన్‌కు వెళ్లాల్సి ఉంది. ఇందు కోసం బుమ్రా నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. బుమ్రా వైపుపై వాపు ఉందని.. ఎన్సీఏ కోలుకునే వరకు పర్యవేక్షించనున్నట్లు పేర్కొంది. మూడువారాల పాటు అక్కడే ఉంటాడని.. ఆ తర్వాత ఒకటి, రెండు మ్యాచులు ఆడాల్సి ఉండనున్నది. ఫిట్నెస్ను పరీక్షించేందుకు ప్రాక్టీస్ మ్యాచులు ఆడతాడు. ప్రస్తుతం గ్రేడ్-1 గాయంతో బాధపడుతున్నాడని.. త్వరలోనే కోలుకుంటాడని బీసీసీఐ భావిస్తుంది.
ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించే ప్రాబబుల్స్‌లో ఎంపిక చేసే అవకాశం ఉంటుందని.. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లాండ్‌తో భారత్ పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనున్నది. ఇందులో బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. చాంపియన్స్ ట్రోఫీకి ముందు పటిష్టమైన జట్టును ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఐదు మ్యాచుల టీ20, మూడు వన్డేల సిరీస్ కోసం భారత్‌లో ఇంగ్లాండ్ పర్యటించనున్నది. టీ20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటిచింది.