సోమవారం 30 మార్చి 2020
Sports - Mar 26, 2020 , 13:42:06

ఇంట్లోనే ఉండండి బ‌య‌ట‌కు రావ‌ద్దు: వీరూ

ఇంట్లోనే ఉండండి బ‌య‌ట‌కు రావ‌ద్దు:  వీరూ

ఇంట్లోనే ఉండండి బ‌య‌ట‌కు రావ‌ద్దు:  వీరూ

న్యూఢిల్లీ: ప‌్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఒక‌రినొక‌రు క‌లుసుకునేందుకు అవ‌కాశం లేక‌పోయినా..ప్ర‌ముఖ క్రీడాకారులు మాత్రం సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో ట‌చ్‌లోనే ఉంటున్నారు. ఏ విష‌యాన్ని అయినా ముక్కుసూటిగా చెప్ప‌డంలో ముందుండే భార‌త మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వ‌గ్..ఇన్‌స్గాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్‌కు సందేశ‌మిచ్చాడు. క‌రోనా వైరస్ వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు ఇంట్లోనే ఉండాల‌ని ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్దంటూ వీరూ హెచ్చ‌రించాడు. ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించినా..అన‌వ‌స‌రంగా కొంతమంది వీధుల్లోకి వస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్న సంఘ‌ట‌న‌లు తాను చూస్తూనే ఉన్నాన‌ని చెపుకొచ్చాడు.  బ‌యట జ‌రుగుతున్న విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు త‌న దోస్తుల ద్వారా తెలుసుకుంటున్నాని అన్నాడు. తొలిసారి ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ సంస్థ‌లు లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ జీతాలు చెల్లిస్తామ‌ని ముందుకొచ్చిన కొంత‌మంది అన‌వ‌స‌రంగా బ‌య‌ట తిరుగుతున్నారని వీరూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. లాక్‌డౌన్ స‌మ‌యంలో తాను కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి గ‌డుపుతున్నాని చెప్పాడు . ప్ర‌తి రెండు గంట‌ల‌కు మూడు, నాలుగు సార్లు చేతుల‌ను సానిటైజ‌ర్‌తో శుభ్రం చేసుకుంటున్నాని తెలిపాడు.


logo