బెంగళూరు: భారత్, న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్టు (Bengaluru Test) ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి రోజు ఆటకు వరుణుడు అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. అయితే వర్షం తెరపినివ్వడంతో ఎట్టకేలకు టాస్ పడింది. టీమ్ ఇండియా టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగింది. వన్‌డౌన్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతినిచ్చిన భారత్.. సర్ఫరాజ్ ఖాన్‌కు చోటిచ్చింది. మూడో పేసర్ ఆకాశ్ దీప్‌ను పక్కనపెట్టి కుల్దీప్ యాదవ్‌ను తీసుకున్నది. యశస్వీ జైస్వాల్‌తో కలిసి హిట్‌మ్యాన్ ఇన్నింగ్ ప్రారంభించారు. కాగా, గిల్ వందశాతం ఫిట్‌గా లేకపోవడం వల్ల అతడికి రెస్ట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు కెప్టెన్ రోహిత్ పేర్కొన్నాడు.
తొలి రోజు ఆట వర్షార్పణమైన నేపథ్యంలో రెండో రోజు 15 నిమిషాల ముందే మ్యాచ్ ఆరంభమైంది. తొలి సెషన్ 9.15 నుంచి 11.30 వరకు సాగనుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 12.10 గంటలకు మొదలై 2.45 దాకా ఉండనుంది. మూడో సెషన్‌ను మధ్యాహ్నం 2.45 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు జరుగనుంది.
తుది జట్లు ఇలా..
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్ : టామ్ లేథమ్ (కెప్టెన్), డేవన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓరూర్కీ
🚨 Toss 🚨
Captain @ImRo45 wins the toss and #TeamIndia elect to bat in the 1st Test 👌👌
Match Updates ▶️ https://t.co/8qhNBrs1td#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/ovQuU2WLvE
— BCCI (@BCCI) October 17, 2024