Rafael Nadal : టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన రఫెల్ నాదల్ (Rafael Nadal) క్రీడాలోకాన్ని ఒకింత షాక్‌కు గురి చేశాడు. 23 ఏండ్ల కెరీర్లో అద్భుత రాకెట్ విన్యాసాలతో అభిమానులను అలరించిన ‘స్పెయిన్ బుల్’ ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. టెన్నిస్‌లో ఓ శకాన్ని ముగించిన నాదల్ ఆటను గుర్తు చేసుకుంటూ క్రీడా ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ‘క్లే కోర్ట్ కింగ్’గా పేరొందిన నాదల్‌ను కొనియాడుతూ భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi)లు పోస్ట్‌లు పెట్టారు. వాళ్లు ఏం అన్నారంటే..?
నాదల్ ఆటను ఆస్వాదిస్తూ పెరిగిన బుమ్రా అతడి ప్రతిభను యాది చేసుకున్నాడు. ‘చెక్కుచెదరని పట్టుదల, అంకితభావం. అద్భుతమైన యోధుడు అంటూ బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. ఆ పక్కనే నాదల్ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీతో ఉన్న ఫొటోకు మరపురాని కెరీర్ కొనసాగించినందుకు అభినందనలు’ అని బుమ్రా రాశాడు.
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) కూడా రఫా సేవల్ని ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టాడు. లెజెండ్.. క్రీడాలోకంలో ఒక గొప్ప ఆటగాడివైన నీకు వీడ్కోలు శుభాకాంక్షలు అని పాండ్యా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. ఇక అర్జెంటీనా లెజెండ్ మెస్సీ సైతం నాదల్‌ను ఆకాశానికెత్తేశాడు. ‘కష్టపడే గుణంలో నువ్వు ఎందరికో స్ఫూర్తి. కొన్నేండ్ల పాటు అత్యుత్తమ ర్యాంక్‌లో కొనసాగడం చాలా గొప్ప విషయం’ అని మెస్సీ వీడియో పోస్ట్‌లో తెలిపాడు.
‘You are an example to everyone because of your hard work and perseverance’
Rafael Nadal has been an inspiration to fans and athletes alike throughout his career, including Lionel Messi, who recorded this message to congratulate @RafaelNadal on winning his fourth Laureus Award. pic.twitter.com/Xvnm5KfzVM
— Laureus (@LaureusSport) October 10, 2024
మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. కోట్లాది మంది అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తూ సుదీర్ఘ కెరీర్‌కు స్పెయిన్ బుల్ చరమగీతం పాడాడు. 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుపొందిన రఫా గాయాలతో వేగలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆఖరి సారిగా దేశం తరఫున డేవిస్ కప్‌లో ఆడతానని 38 ఏండ్ల నాదల్ వెల్లడించాడు.
Mil gracias a todos
Many thanks to all
Merci beaucoup à tous
Grazie mille à tutti
谢谢大家
شكرا لكم جميعا
תודה לכולכם
Obrigado a todos
Vielen Dank euch allen
Tack alla
Хвала свима
Gràcies a tots pic.twitter.com/7yPRs7QrOi— Rafa Nadal (@RafaelNadal) October 10, 2024
‘నవంబర్‌లో మలగాలో జరుగబోయే డేవిస్ కప్‌లో స్పెయిన్ తరఫున చివరిసారి ఆడుతా. నిజం చెప్పాలంటే.. గత కొన్ని ఏండ్లు చాలా కష్టంగా గడిచాయి. మరీ ముఖ్యంగా గత రెండు ఏండ్లు ఎన్నో బాధలు పడ్డాను. ఎంతో ఇష్టమైన ఆటకు వీడ్కోలు పలకడం ఎంతో కష్టమైన నిర్ణయం. అందుకు నాకు ఎంతో సమయం పట్టింది. అయితే.. జీవితంలో ప్రతిదానికి ఆరంభం ఉన్నట్టే ముగింపు కూడా ఉంటుంది’ అని నాదల్ తన వీడ్కోలు ప్రకటనలో తెలిపాడు.