Hyderabad | హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం
Hyderabad | హైదరాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దసరా పండుగ షాపింగ్కు బయటకు వచ్చిన జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఫిల్మ్ నగర్, సోమాజిగూడ, కొండాపూర్, బేగంపేట్, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, అమీర్పేట, మాదాపూర్, హైటెక్ సిటీతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో రామంతాపూర్, ఉప్పల్, తార్నాక, రాంనగర్, హబ్సిగూడ, నాచారం, నాగోలు, ఎల్బీనగర్, కొత్తపేట, హయత్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
రాగల మూడురోజులు సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది.
శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వానలు పడుతాయని హెచ్చరించింది. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడుతాయని చెప్పింది.
ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కొనసాగుతాయని.. ఈ నెలలో అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ఇవి కూడా చదవండి..
Job Notification | ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Harish Rao | తెలంగాణకు నిధులు తేవడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలం : హరీశ్ రావు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

