Jagadish Reddy | పోలీస్ రాజ్యం చేసిన వాళ్లేవరూ చరిత్రలో మిగల్లే.. రేవంత్‌పై ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫైర్
బతుకమ్మ ఏర్పాట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. బతుకమ్మ అన్నా, బతుకమ్మ పాటలన్నా రేవంత్ రెడ్డికి భయం పుడుతుందని విమర్శించారు. రాష్ట్రమంతా బతుకమ్మ పాటలు, సౌండ్ సిస్టంలపై నిషేధం పెట్టారని చెప్పారు.
సూర్యాపేట: బతుకమ్మ ఏర్పాట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. బతుకమ్మ అన్నా, బతుకమ్మ పాటలన్నా రేవంత్ రెడ్డికి భయం పుడుతుందని విమర్శించారు. రాష్ట్రమంతా బతుకమ్మ పాటలు, సౌండ్ సిస్టంలపై నిషేధం పెట్టారని చెప్పారు. ఎక్కడా ఉత్సాహంగా పండుగ జరగకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జేజే నగర్లో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ నిర్వాకంతో మహిళలంతా నిరుత్సాహపడ్డారన్నారు. పోలీస్ రాజ్యం చేసిన వాళ్లేవరూ చరిత్రలో మిగల్లేదని విమర్శించారు.
రావలసిన సమయంలో కేసీఆర్ వస్తారని తెలిపారు. వరదల్లో ఒక్క రోజు తిరిగితేనే తట్టుకోలేక నిర్బంధం పెట్టారని వెల్లడించారు. మూసీ , హైడ్రా కూల్చివేతలపై బాధితుల నుంచి వస్తున్న పాటలు ప్రాచుర్యం కాకుండా నిషేధం విధించారన్నారు. నిజాంలను, నియంతలను ఎదురించింది పాటల ద్వారానే ప్రజల గొంతులను పోలీస్ బలంతో ఆపాలని అనుకోవడం మూరకత్వమని చెప్పారు. హామీల అమలుపై ప్రశ్నించకుండా అణచివేయాలనే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పండుగ కల తప్పిందని ప్రజలు అనడం రేవంత్ పరిపాలనకు నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలో
మళ్లీ కేసీఆర్ రావాలని అడుగుతున్నారని తెలిపారు. నిషేధాజ్ఞలు ఎన్ని పెట్టినా సంస్కృతి, వారసత్వాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. దాడులు, కేసులు, నిషేదాలతో పాటలను ఆపలేవు రేవంత్ అంటూ హెచ్చరించారు.
అట్లతద్దె సంస్కృతి వారితో అంటకాగిన రేవంత్‌కి బతుకమ్మ ప్రాధాన్యం తెలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ ఏర్పాట్లలో విఫలమైనందుకు మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ సాంప్రదాయంపై నిర్బంధం పెట్టిన వాళ్లు అంతమైపోయారని చెప్పారు. ఇలానే కొనసాగితే ప్రజల నుంచి అంతర్యుద్ధం తప్పదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Layoffs | భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైన మరో టెక్ దిగ్గజం.. SAPలో 10 వేల ఉద్యోగాలకు కోత?
Akhil | భార్యతో కలిసి జపాన్ చెక్కేసిన అఖిల్ అక్కినేని.. రెండు వారాల ట్రిప్ వెనుక అసలు కారణం ఇదే!
IND vs NZ | తొలి రోజు ఐదు వికెట్లు తీసిన భారత్.. కివీస్ స్కోర్ ఎంతంటే..!
Alias Rukmini Trailer | పగలు కోర్టులో స్టెనోగ్రాఫర్, రాత్రి రొమాంటిక్ రచయిత.. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్!
Bomb Cyclone effect | బాంబ్ సైక్లోన్‌తో అమెరికా ఉక్కిరిబిక్కిరి.. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు..!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

