ప్రతి కార్యకర్తకూ పాదాభివందనం.. అల్గునూర్ అడ్డా.. బీఆర్ఎస్ గడ్డ
కరీంనగర్ కార్పొరేషన్‌కు ముఖద్వారం అల్గునూర్ అని, ఇది బీఆర్ఎస్ అడ్డా అని, ఇక్కడి 8వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి కాల్వ మల్లేశంను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రతి కార్యకర్తకూ పాదాభివందనం చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు.
- మాజీ ఎమ్మెల్యే రసమయి
కరీంనగర్ కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 13 : కరీంనగర్ కార్పొరేషన్‌కు ముఖద్వారం అల్గునూర్ అని, ఇది బీఆర్ఎస్ అడ్డా అని, ఇక్కడి 8వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి కాల్వ మల్లేశంను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రతి కార్యకర్తకూ పాదాభివందనం చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు. 1095 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన మల్లేశం, బీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌రెడ్డి, రావుల రమేశ్, సింగిరెడ్డి స్వామిరెడ్డి, తదితరులతో కలిసి ఆయన అల్గునూర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ కట్టబెట్టి అల్గునూర్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని మరోసారి నిరూపించిన అల్గునూర్ వార్డు వాసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విజయం ప్రతి కార్యక్రర్తకూ అంకితమన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న క్రమంలో భారీ ప్రదర్శన వద్దని, తిరిగి రెండు రోజుల్లో విజయోత్సవ సంబురాలు చేసుకుందామని చెప్పారు. కార్పొరేటర్‌గా గెలుపొందిన కాల్వ మల్లేశం మాట్లాడుతూ, భారీ మెజార్టీతో తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలని తెలిపారు. తనను ఆదరించి, పది రోజుల పాటు నిద్రాహారాలు మాని కష్టపడ్డ ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సల్లా మహేందర్, యూత్ అధ్యక్షుడు గట్టెపల్లి దీపక్, పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
Thailand Queen: గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపిన థాయ్‌ల్యాండ్ క్వీన్… వీడియో
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

