FIFA Rankings : ఈమధ్య కాలంలో చెత్త ఆటకు భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. ఫిఫా వరల్డ్ ర్యాంకింగ్స్ (FIFA World Rankings)లో మరింత వెనకబడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు స్థానాలు కోల్పోయింది. గురువారం ఫిఫా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ‘బ్లూ టైగర్స్’ (Blue Tigers) 133వ ర్యాంక్‌లో నిలిచింది. ఈ తొమ్మిదేళ్లలో టీమిండియా ఇంత తక్కువ ర్యాంక్‌కు దిగజారడం ఇదే మొదటిసారి. 2016లో 135వ ర్యాంక్ ఇప్పటివరకూ మన జట్టుకు అత్యల్ప ర్యాంక్‌గా ఉంది. గురువారం అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య విడుదల చేసిన ర్యాంకిగ్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాలో అగ్రస్థానంలో ఉండగా.. స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లండ్, బ్రెజిల్ జట్లు టాప్ -5లో కొనసాగుతున్నాయి.
నిరుడు వందలోపు ర్యాంక్ సాధించిన భారత జట్టు.. ఈ సీజన్లో మైదానంలో తీవ్రంగా నిరాశపరుస్తోంది. సీనియర్ ఆటగాడు సునీల్ ఛెత్రీ (Sunil Chhetri) వీడ్కోలు పలకడం, కోచ్ మనొలో మర్కెజ్పై వేటు కారణంగా జట్టు ప్రదర్శన పాతాళానికి చేరింది. జూన్ 4న థాయ్‌లాండ్‌తో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో టీమిండియా 0-2తో ఓటమి పాలైంది.
🚨 BREAKING! 🚨
The Indian men’s football team has fallen 6⃣ spots to 1⃣3⃣3⃣rd in the latest #FIFA rankings announced today.
DETAILS ➡️ https://t.co/1Kvkw7EzQh pic.twitter.com/PFWE01ZBL7
— Sportstar (@sportstarweb) July 10, 2025
ఆసియా కప్ క్వాలిఫయింగ్ రౌండ్లో మరీ దారుణంగా తమకంటే తక్కువ ర్యాంక్ జట్టైన హాకాంగ్ చేతిలో 0-1తో పరాజయం మూటగట్టుకుంది. ఈ సీజన్లో బ్లూ టైగర్స్ పేలవ ప్రదర్శన కారణంగా సునీల్ ఛెత్రీ యూటర్న్ తీసుకొని జట్టుతో కలిశాడు. అతడి రాకతో జట్టు ఆత్మస్థైర్యం పెరనుంది. అక్టోబర్‌లో జరుగబోయే ఆసియా క్వాలిఫయర్స్‌లో సింగపూర్‌తో భారత్ తలపడనుంది.
🇦🇷 Argentina remain on top of FIFA’s World Ranking list. 💪 Which nation will be next? pic.twitter.com/tQPvmMbqku
— Flashscore.com (@Flashscorecom) July 10, 2025