త్రిపురారం, జులై 10 : ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామ సెంటర్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని నల్లగొండ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.శ్రీనివాస్‌రావు అన్నారు. గురువారం త్రిపురారం మండల కేంద్రంలో నిర్మిస్తున్న కామన్ సోక్పిట్స్ను ఆయన పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో కామన్ సోక్పిట్స్, హౌస్ సోక్పిట్స్ ఏర్పాటు చేసుకోవాలని, వృథాగా పోయే నీటిని ఒడిసిపట్టి భూమిలో ఇంకేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కునిరెడ్డి విజయకుమారి, ఎంపీఓ కోడిరెక్క రాజేంద్రకుమార్, ఏపీఓ శ్యామల, గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.