INDW vs ENGW : ఇండోర్‌లో భారీ ఛేదనలో విజయానికి చేరువైన భారత్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. అర్ధ శతకంతో చెలరేగిన స్మృతి మంధాన(88) వెనుదరిగిన కాసేపటికే డేంజరస్ రీచా ఘోష్(8) ఔటయ్యింది. రన్‌రేటు ఒత్తిడి కారణంగా ఇంగ్లండ్ కెప్టెన్ బ్రంట్ ఓవర్లో పెద్ద షాట్లకు యత్నించిన వీరిద్దరు డగౌట్ చేరారు. దాంతో.. 256 వద్ద భారత్ ఐదో వికెట్ పడింది.
కీలక బ్యాటర్లు ఔటైనా జట్టును గెలిపించేందుకు పోరాడుతోంది దీప్తి శర్మ(50). కానీ.. ఎకిల్‌స్టోన్ వేసిన 47వ ఓవర్లో ఆమె సోఫీ డంక్లే చేతికి చిక్కింది. దాంతో.. టీమిండియా మరింత కష్టాల్లో పడింది. బంతుల్లో రన్స్ కావాలి. ఆల్‌రౌండర్లు అమన్‌జోత్ కౌర్ (6), స్నేహ్ రానాలు క్రీజులో ఉన్నారు.
4️⃣ wickets with the ball!
5️⃣0️⃣ runs in the chase!An all-round masterclass from Deepti Sharma in Indore tonight! 🙌
Updates ▶ https://t.co/jaq4eHaH5w#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvENG | @Deepti_Sharma06 pic.twitter.com/3ZBsyF5KEJ
— BCCI Women (@BCCIWomen) October 19, 2025