INDW vs NZW 3rd ODI : సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి వన్డేలో భారత బౌలర్లు తడాఖా చూపించారు. రెండో వన్డేలో విజయంతో జోరు మీదున్న న్యూజిలాండ్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. స్పిన్నర్ ప్రియా మిశ్రా(2/41) విజృంభణతో కివీస్ టాపార్డర్ కుప్పకూలింది. ఒకదశలో 88 పరుగులకే ఐదు వికెట్లు పడగా బ్రూక్ హల్లిడే(86) హాఫ్ సెంచరీతో కదం తొక్కింది. వికెట్ కీపర్ ఇసబెల్లా గేజ్(25)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. ఆఖర్లో పేసర్ లీ తహుహు(24) దంచి కొట్టి జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించింది. హల్లిడే, తహుహుల పోరాటంతో భారత్‌కు కివీస్ 233 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టీ20 వరల్డ్ కప్‌లో లీగ్ దశలోనే ఇంటికొచ్చేసిన భారత మహిళల జట్టు స్వదేశంలో వన్డే సిరీస్‌లో విజయానికి చేరువైంది. మూడో వన్డేలో న్యూజిలాండ్ టాపార్డర్ స్వల్ప స్కోర్‌కే ఔటైనా.. మిడిలార్డర్ రాణించింది. దాంతో, కివీస్ పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 24 పరుగుల వద్ద ఓపెనర్ సుజీ బేట్స్(4) వికెట్ కోల్పోయింది. జెమీమా రోడ్రిగ్స్ మెరుపు త్రోతో ఆమె రనౌట్ అయింది. అనంతరం ప్రియా మిశ్రా (2/41)తిప్పేయడంతో ఓపెనర్ జార్జియా ప్లిమ్మర్(39), కెప్టెన్ సోఫీ డెవినె(9)లు వెనుదిరిగారు.
Another Match 🤝 Another Catch@Radhay_21 combines with @Deepti_Sharma06 to dismiss the well set Brooke Halliday 👌
Updates ▶️ https://t.co/B6n070idAW#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/80CquV3tTb
— BCCI Women (@BCCIWomen) October 29, 2024
అప్పటికే షాక్‌లో ఉన్న కివీస్‌ను మరింత దెబ్బకొడుతూ డేంజరస్ లారెన్ డౌన్(1)ను పేసర్ సైమా థాకూర్ వెనక్కి పంపింది. దాంతో, 88 పరుగులకే కివీస్ 5 వికెట్లు కోల్పోయింది. ఇక కివీస్ స్కోర్ 150 దాటడం గగనమే అనుకన్న దశలో.. బ్రూక్ హల్లిడే(86) సాధికారిక ఇన్నింగ్స్ ఆడింది. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఆమె మ్యాడీ గ్రీన్(15), ఇసాబెల్లా గేజ్(39)లతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. మూడు భారీ సిక్సర్లు బాదిన హల్లిడే సెంచరీకి ముందు దీప్తి శర్మ ఓవర్లో రాధా యాదవ్ చేతికి చిక్కింది. అప్పటికీ న్యూజిలాండ్ స్కోర్ 199. అనంతరం హన్నాహ్ రొవే(11), లీ తహుహు(24)లు పట్టుదలగా ఆడారు. రేణుకా వేసిన 49వ ఓవర్ ఆఖరి బంతిని తహుహు సిక్సర్‌గా మలిచింది. సైమా వేసిన 50వ ఓవర్లో బౌండరీ బాదిన లిహిహు జట్టు స్కోర్ 230 దాటించింది.