Olympics : పారిస్ ఒలింపిక్స్ ముగియడంతో అందరు లాస్ ఏంజెలెస్ (Los Angeles) మీద దృష్టి సారించారు. 2028లో జరుగబోయే విశ్వ క్రీడల్లో మళ్లీ పతకాలు కొల్లగొట్టేందుకు అథ్లెట్లు, క్రీడాకారులు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అయితే.. ఓ ఆటకు మాత్రం ఆ చాన్స్ లేదు. అవును.. ఒలింపిక్స్ నుంచి బ్రేక్ డాన్స్ (Break Dance)ను తొలగించారు. అందుకు బలమైన కారణమే ఉందండోయ్..
పారిస్ వేదికగా తొలిసారి ఒలింపిక్స్లో బ్రేక్డాన్స్ పోటీలకు అనుమతించారు. అయితే.. డ్యాన్సర్ల ప్రదర్శనపై నెట్టింట తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఆ విభాగాన్ని తొలగించింది. దాంతో, బ్రేక్ డాన్సర్లు ఉసూరుమంటున్నారు. పారిస్ వేదికగా ఆగస్టు 9న బ్రేక్ డాన్స్ పోటీలు మొదలయ్యాయి. దాంతో, దివంగత మైఖేల్ జాక్సన్ (Michael Jackson) తరహా స్పెప్పులతో డాన్సర్లు అలరిస్తారని అంతా ఊహించారు. కానీ, వాళ్లు అనుకున్నది ఒక్కటి స్టేజి మీద జరిగిందొకటి.
Australia is gonna single-handedly get breakdancing taken out of the Olympics 😂😂😂 pic.twitter.com/yKk1HeOrz1
— Vivek Girotra (@vivekgirotra) August 9, 2024
అవును.. పోటీల సమయంలో డ్యాన్సర్లు వేసిన కుప్పిగంతులు, జిమ్నాస్ట్ల మాదిరి చేష్టలు చూసిన అభిమానులు ఇదేం బ్రేక్ డాన్సురా అంటూ విమర్శలు గుప్పించారు. ఇక ఆస్ట్రేలియా బ్రేక్ డాన్సర్ రాచెల్ గున్ (Rachael Gunn) వీడియో చూశారంటే మీరు కూడా పడిపడి నవ్వుకోవడం ఖాయం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.