న్యూఢిల్లీ: బీజేపీ(BJP) ఆఫీసు బేరర్ల మీటింగ్ ఈనెల 17వ తేదీన నిర్వహించనున్నారు. ఆ సమావేశాలకు.. అన్ని రాష్ట్రాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలో హాజరుకానున్నారు. మరో వైపు బీజేపీ నేతలు .. హిండెన్‌బర్గ్ రిపోర్టు విషయంలో కాంగ్రెస్‌కు కౌంటర్ ఇస్తున్నారు. దేశాన్ని ఆర్థిక గందరగోళంలోకి నెట్టేస్తున్నారని, కాంగ్రెస్ దీనికి కుట్రపన్నినట్లు రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. హిండెన్‌బర్గ్ సంస్థలో మోదీ వ్యతిరేకంగా ఉండే జార్జ్ సోరెస్ పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపించారు. భారత దేశాన్నిఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయరాదు అని రాహుల్ గాంధీని కోరారు.