YS Jagan | జగన్ అధికారంలో ఉండి ఉంటే.. పథకాలన్నీ అందేవి : మాజీ ముఖ్యమంత్రి
YS Jagan | తాను అధికారంలోకి ఉండి ఉంటే పథకాలన్నీ ప్రజలకు అందేవని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.
అమరావతి : తాను అధికారంలోకి ఉండి ఉంటే పథకాలన్నీ ప్రజలకు అందేవని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan ) అన్నారు. రైతులు సంతోషంగా ఉండేవారని , విద్యాదీవెన, వసతి దీవెన అంది పిల్లల తల్లుల్లో ఆనందం వెల్లివిరిసేదని పేర్కొన్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) సందర్భంగా మంగళవారం అనకాపల్లి, చోడవరం , మాడుగుల నియోజకవర్గాలకు చెందిన ఎంపీటీసీలు (MPTC), జడ్పీటీసీ (ZPTC) లతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ అధికారంలో ఉండి ఉంటే సకాలంలో షెడ్యూల్ ప్రకారం అన్ని వర్గాలకు పథకాలు అందేవని గుర్తు చేశారు. ప్రతి ఇంటికి మంచి చేశామని, చేసిన మంచి ఎక్కడికీ పోదని, వచ్చే ఎన్నికలు మనకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. వైసీపీ (YCP) అధికారంలో లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు పేదలకు అందడం లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, రెడ్‌బుక్ పాలన నడుస్తోందని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికైనా , ఏ పార్టీకైనా కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తరువాత వెలుగు ఉంటుందని వెల్లడించారు. చంద్రబాబు ప్రజలకు ఆశ చూపి గెలిచారని, అధికారంలోకి వచ్చిన తరువాత బాబు నైజం బయటపడిందని ఎద్దేవా చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

