Trent Boult : ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ టోర్నీని న్యూజిలాండ్(Newzealand) విజయంతో ముగించింది. చివరి లీగ్ మ్యాచ్‌లో పసికూన ఉగాండా(Uganda)పై సూపర్ విక్టరీతో కివీస్ ఇంటిదారి పట్టింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన న్యూజిలాండ్ చెత్త ఆటతో వెనుదిరగడం ఆ దేశ అభిమానులకు గుండెకోత మిగిల్చింది. కేన్ విలియమ్సన్ సేన సూపర్ – 8కు క్వాలిఫై కాకపోవడంతో.. ఆ జట్టు స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ (Trent Boult) కీలక నిర్ణయం తీసుకున్నాడు.
ఉగాండాతో మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన బౌల్ట్ .. ఇదే నా ఆఖరి వరల్డ్ కప్ అని చెప్పేశాడు. దాంతో.. 34 ఏండ్ల బౌల్ట్ టీ20 కెరీర్ ముగిసిందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ‘బహుశా ఇదే నాకు చివరి టీ20 వరల్డ్ కప్ టోర్నీ. నేను మీతో చెప్పదలచుకున్నది ఇదొక్కటే. మెగా టోర్నీలో మేము అనుకున్నట్టుగా శుభారంభం దక్కలేదు. ఈ వైఫల్యాన్ని జీర్ణించుకోవడం కష్టమే.
New Zealand ace Trent Boult confirms ongoing T20 World Cup will be his last #newzealand #t20inUSA #T20WworldCup pic.twitter.com/ob7sxS90Hd
— SportsTiger (@The_SportsTiger) June 15, 2024
రెండో రౌండ్ (సూపర్ 8)కు వెళ్లలేకపోయామేనే బాధలో ఉన్నామంతా. అయితే.. దేశానికి ప్రాతినిధ్యం వహించే చాన్స్ రావడం నా అదృష్టం. ఇది నిజంగా గొప్ప క్షణం’ అని బౌల్ట్ భావోద్వేగంతో చెప్పాడు. టీ20 స్పెషలిస్ట్ అయిన బౌల్ట్.. ఐపీఎల్లో సూపర్ హిట్ అయ్యాడు. ఫ్రాంచైజీ క్రికెట్ కోసం సెంట్రల్ కాంట్రాక్ట్ సైతం వదులుకున్నాడు. అయితే.. దేశం తరఫున టీ20 వరల్డ్ కప్‌లో ఆడాలనుకున్న బౌల్ట్‌కు న్యూజిలాండ్ క్రికెట్ చాన్స్ ఇచ్చింది. కానీ, ఈ స్టార్ పేసర్ విండీస్ పిచ్‌లపై తన మార్క్ చూపించలేకపోయాడు. ప్రస్తుతం 34 ఏండ్లున్న బౌల్ట్ మరో రెండేండ్లు ఫిట్‌గా ఉండడం, టీ20 జట్టులో ఆడడం అనుమానమే. అందుకనే అతడు ఆఖరి వరల్డ్ కప్ ఆడేశానని చెప్పి ఉంటాడు.
Trent Boult has confirmed that he is playing his last #T20WorldCup 🗣
Full story 👉 https://t.co/RWtZOceRNR #NZvUGA pic.twitter.com/jBSrCqXwu2
— ESPNcricinfo (@ESPNcricinfo) June 15, 2024
వరల్డ్ కప్‌లో గ్రూప్ సిలో ఉన్న న్యూజిలాండ్‌కు ఎట్టకేలకు ఓ విజయం దక్కింది. ట్రినిడాడ్‌లో శనివారం ఉగాండాపై కివీస్ పేసర్లు చెలరేగారు. పేస్, బౌన్స్‌కు అనుకూలించిన పిచ్‌పై టిమ్ సౌథీ(3/4) బౌల్ట్(2/7)లు హడలెత్తించగా పసికూన జట్టు 40 పరుగులకే ఆలౌటయ్యింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కివీస్ 5.2 ఓవర్లలోనే ఛేదించింది. దాంతో, రెండు పాయింట్లతో కివీస్ మూడో స్థానంలో నిలిచింది. ఈ గ్రూప్ నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించిన అఫ్గనిస్థాన్, వెస్టిండీస్ జట్లు సూపర్ 8 బెర్తు సొంతం చేసుకున్నాయి.
A comfortable win for New Zealand after an uncomfortable World Cup so far 🇳🇿
🔗 https://t.co/odHLdUTwT5 | #NZvUGA pic.twitter.com/yDrn5R6UnI
— ESPNcricinfo (@ESPNcricinfo) June 15, 2024