French Open : ఫ్రెంచ్ ఓపెన్(French Open) డబుల్స్‌లో భారత స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న(Rohan Bopanna) ప్రస్థానం ముగిసింది. మట్టి కోర్టులో ఏడేండ్ల తర్వాత టైటిల్ గెలవాలనుకున్న అతడి కల చెదిరింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ (Mathew Ebden) జంట అనూహ్యంగా ఓటమి పాలైంది.
ఇటలీకి చెందిన సిమొనె బొలెలీ, ఆండ్రియా వవస్సొరి జోడీ బోపన్న, ఎబ్డెన్ ద్వయానికి చెక్ పెట్టింది. గంట 58 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో బోపన్న జంట 5-7, 6-2, 2-6తో మ్యాచ్ చేజార్చుకుంది. విశేషం ఏంటంటే.? ఈ విజయంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ పోరులో ఎదురైన ఓటమికి ఇటాలియన్ జంట ప్రతీకారం తీర్చుకుంది.
🇮🇹 Final Feeling 🇮🇹
Bolelli/Vavassori are through to the men’s doubles title match defeating Bopanna/Ebden 7-5, 2-6, 6-2.#RolandGarros pic.twitter.com/K6BEi3gbuq
— Roland-Garros (@rolandgarros) June 6, 2024
ఈ ఏడాది జోరుమీదున్న బోపన్న, ఎబ్డెన్ జోడీ ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ప్రీ క్వార్టర్స్‌లో అతికష్టమ్మీద గట్టెక్కినా.. క్వార్టర్స్‌లో బోపన్న జంట సునాయస విజయంతో సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. అయితే.. కీలకమైన సెమీస్ పోరులో 44 ఏండ్ల భారత స్టార్ విఫలమయ్యాడు. ప్రత్యర్థి ధాటికి బోపన్న- ఎబ్డెన్‌లు కేవలం ఒకే ఒక బ్రేక్ పాయింట్ సాధించారు. ఫ్రెంచ్ ఓపెన్ ఓటమితో వీళ్లిద్దరూ ఇక వింబుల్డన్‌పై దృష్టి సారించనున్నారు.