IND vs ZIM : తొలి టీ20లో యువ భారత్ జింబాబ్వే(Zimbabwe)ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసింది. యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్(4/13) కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయగా.. ఆతిథ్య జట్టు 115 పరుగులకే పరిమితమైంది. రెండో ఓవర్ నుంచే తడబడిని జింబాబ్వే టాపార్డర్‌ను బిష్ణోయ్ డగౌట్ పంపి ఒత్తిడిలోకి నెట్టాడు.
ఇక వాషింగ్టన్ సుందర్(2/11) సైతం ఓ చేయి వేయడంతో ప్రధాన ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. ఒకదశలో 90 పరుగులకే ఆలౌట్ అంచున నిలిచిన జట్టును క్లైవ్ మడందే(29 నాటౌట్) ఆదుకున్నాడు. ఆఖరి ఓవర్లలో మెరుపు బ్యాటింగ్‌తో జింబాబ్వేకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.
క్లైవ్ మడందే(29 నాటౌట్)
టాస్ ఓడిన ఆతిథ్య జట్టుకు ఆదిలోనే ముకేశ్ కుమార్ షాకిచ్చాడు. ఓపెనర్ ఇన్నోసెంట్ కియా(0)ను డకౌట్ చేసి వికెట్ల పతనానికి నాంది పలికాడు. ఆ తర్వాత బంతి అందుకున్న రవి బిష్ణోయ్ తన స్పిన్ మాయ చూపించాడు. మరో ఓపెనర్ వెస్లే మధీవెరె(23) జతగా ధాటిగా ఆడిన బ్రియాన్ బెన్నెట్(23)ను బౌల్డ్ చేసి జింబాబ్వే బ్యాటర్లలో గుబులు పుట్టించాడు. పవర్ ప్లేలో రెండు వికెట్లు పడడంతో.. కెప్టెన్ సికిందర్ రజా(17) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు.
11 overs done ✅#TeamIndia keep things tight with the ball as Zimbabwe reach 73/3
Follow The Match ▶️ https://t.co/r08h7yfNHO#ZIMvIND pic.twitter.com/Kv68jgrPfc
— BCCI (@BCCI) July 6, 2024
కానీ, అవేశ్ ఖాన్ అతడిని బోల్తా కొట్టించి జింబాబ్వేను మరింత కష్టాల్లోకి నెట్టాడు. వాషింగ్టన్ సుందర్ సైతం ఓ చేయి వేయగా.. తన రెండో స్పెల్‌లో బిష్ణోయ్ టెయిలెండర్ల పని పట్టాడు. అయితే.. ఆఖర్లో క్లైవ్ మడందే(29 నాటౌట్) దూకుడుగా ఆడి జింబాబ్వే స్కోర్ 100 దాటించాడు. క్లైవ్ పోరాటంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 రన్స్ చేసింది. భారత బౌలర్లలో సుందర్ రెండు, అవేశ్ ఖాన్ ఒక వికెట్ తీశారు.
&
Innings Break!
A terrific bowling display from #TeamIndia as they restrict Zimbabwe to 115/9 👏👏
4⃣ wickets for Ravi Bishnoi
2⃣ wickets for Washington Sundar
A wicket each for Mukesh Kumar & Avesh KhanStay tuned for the chase ⏳
Scorecard ▶️ https://t.co/r08h7yfNHO… pic.twitter.com/hUGx3BvDby
— BCCI (@BCCI) July 6, 2024