Priyanka Chopra | రాజమౌళి ‘వారణాసి’ బడ్జెట్ రూ.1,300 కోట్లా?.. కపిల్ శర్మ షోలో నోరు విప్పిన ప్రియాంక చోప్రా
The Great Indian Kapil Show | ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబుల క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న పాన్-వరల్డ్ మూవీ 'వారణాసి' (Varanasi) గురించి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' (The Great Indian Kapil Show)లో ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Priyanka Chopra | టాలీవుడ్ డెడ్లీ కాంబినేషన్ రాజమౌళి – మహేష్ బాబుల గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, తాజాగా కపిల్ శర్మ షో సీజన్ 4లో పాల్గొని సినిమా బడ్జెట్, తన రెమ్యూనరేషన్పై సరదాగా స్పందించింది.
కపిల్ శర్మ తనదైన శైలిలో “ఈ సినిమా బడ్జెట్ రూ. 1,300 కోట్లు అని విన్నాను, నిజమేనా?” అని అడగ్గా, ప్రియాంక నవ్వుతూ.. “నిజంగానే 1,300 కోట్లా? ఒకవేళ అదే నిజమైతే, అందులో సగం డబ్బు నా అకౌంట్లోకి వచ్చిందా అని నా మేనేజర్ని అడగాలి” అంటూ చమత్కరించింది. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. రాజమౌళి విజన్‌కు తగ్గట్టుగా ఈ సినిమాను దాదాపు రూ. 1,300 కోట్ల నుంచి రూ. 1,500 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలవనుంది.
ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె నేరుగా తెలుగు సినిమాలో నటిస్తుండటం విశేషం. ఈ సినిమా కోసం మహేష్ బాబు భిన్నమైన గెటప్స్‌లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇప్పటికే ఆఫ్రికాలోని కెన్యా, టాంజానియా అడవుల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. హై-ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) మరియు ఐమాక్స్ (IMAX) ఫార్మాట్లో రూపొందుతున్న ఈ చిత్రం 2027 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది.
🚨🚨 Big BREAKING 🚨🚨
Priyanka Chopra confirmed the official budget of SS RAJAMOULI’S #Varanasi — 1300 cr 💸
Mahesh Babu starrer now becomes the second biggest budget film of India after #Ramayana 🔥 pic.twitter.com/gyzy2vromb— Our Indian Cinema (@OurIndianCinema) December 20, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nic Maddinson | క్యాన్సర్‌ను జయించి 9 ఏళ్లకు పునరాగమనం.. 33 బంతులాడి డకౌట్..!
Mayookha | ‘మయూఖ’ మూవీ రివ్యూ.. భయపెట్టే సస్పెన్స్ థ్రిల్లర్!
‘పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలి’
కరెంట్ లేక ఎండిపోతున్న పంటలు.. హద్నూర్ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
Candidates Ultimatum | టీజీపీఎస్సీకి గ్రూప్-1 అభ్యర్థుల అల్టిమేటం.. జీఆర్ఎల్ ఇవ్వకుంటే ఆమరణ దీక్ష
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

