హైదరాబాద్ : కామారెడ్డి(Kamareddy) జిల్లాలో పెద్దపులి(Tiger)సంచారం జిల్లా వాసులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. తాజాగా జిల్లాలోని మద్దికుంట గ్రామ శివారు గొల్ల రాజారంలో ఆవులపై దాడి చేసింది. ఇటీవలే దోమకొండ, బీబీపే, బిక్కనూరు మండలాల్లో పలు చోట్ల ఆవులపై దాడి చేసింది. సంగమేశ్వర్, పెద్ద మల్లారెడ్డి ప్రాంతాల్లో రెండు ఆవులను చంపేసింది. అంబారిపేట శివారులో మరోసారి పశువులపై దాడి చేసింది.
ఇలా వరుస దాడులతో పులి విరుచుకుపడుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. పశువులను మోతకు తోలుకెళ్లాలంటేనే జంకుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి పులిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు.