IPL 2025 : ఐపీఎల్లో రికార్డు సెంచరీతో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi)పై ప్రశంసలు కురుస్తున్నాయి. టీమిండియా భవిష్యత్ స్టార్ అంటూ మాజీ క్రికెటర్లు 14 ఏళ్ల వైభవ్‌కు కితాబులిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్(Nitish Kumar) అభినందనలు తెలిపారు. తమ రాష్ట్రం ఖ్యాతిని యావత్ ప్రపంచం విస్తరించిన వైభవ్‌కు ప్రైజ్‌మనీ ప్రకటించారు. చిన్నవయసులోనే రికార్డులు బద్ధలు కొట్టిన అతడికి రూ.10 లక్షల రికార్డు ఇస్తామని సీఎం వెల్లడించారు.
‘వైభవ్ సూర్యవంశీకి అభినందనలు. ఐపీఎల్ చరిత్రలో రికార్డు సెంచరీ బాదిన అతడికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తన శ్రమ, ప్రతిభతో ఐపీఎల్లో సంచనంగా మారాడు. భారత క్రికెట్ జట్టుకు భవిష్యత్ తారగా ఆవతరించాడు. ఐపీఎల్లో వైభవ్ ప్రదర్శన పట్ల మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం’ అని నితీశ్ ప్రకటనలో తెలిపారు.
आई॰पी॰एल॰ के इतिहास में सबसे कम उम्र (14 साल) में शतक लगाने वाले खिलाड़ी बने बिहार के श्री वैभव सूर्यवंशी को बधाई एवं शुभकामनाएं। वे अपनी मेहनत और प्रतिभा के बलबूते भारतीय क्रिकेट की एक नई उम्मीद बन गए हैं। सभी को उन पर गर्व है। श्री वैभव सूर्यवंशी एवं उनके पिता जी से वर्ष 2024… pic.twitter.com/n3UmiqwTBX
— Nitish Kumar (@NitishKumar) April 29, 2025
బిహార్‌కు చెందిన వైభవ్‌కు.. చిన్నప్పట్నుంచీ క్రికెట్ అంటే ఇష్టం. కోచ్ మనీశ్ ఓఝా సలహాలతో రాటుదేలిన ఈ కుర్రాడు 12 ఏళ్లకే రంజీల్లో అరంగేట్రం చేశాడు. బిహార్ తరఫున ఖతర్నాక్ ఇన్నింగ్స్‌లు ఆడి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. మెగా వేలంలో రాజస్థాన్ ఫ్రాంచైజీ అతడిని రూ.1.1 కోట్లకు కొన్నది. దాంతో, ఐపీఎల్లో అతి పిన్నవయస్కుడైన క్రికెటర్‌గా వైభవ్ రికార్డు నెలకొల్పాడు.
వైభవ్ సూర్యవంశీ(101) సెంచరీ అభివాదం
ఇక మైదానంలోనూ తన దూకుడు చూపిస్తూ ఈ యంగ్‌స్టర్ 35 బంతుల్లో సెంచరీతో గర్జించాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. వైభవ్ విధ్వంసక సెంచరీ బాదేయండంతో 210 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 18.5 ఓవర్లలోనే ఛేదించింది.