న్యూఢిల్లీ: గుడులకు వెళ్లినంత మాత్రాన బీజేపీలో చేరినట్లు కాదు అని నటి ప్రీతీ జింతా(Preity Zinta) అన్నారు. విదేశాలకు వెళ్లిన తర్వాత స్వదేశం విలువ మరింత తెలిసి వచ్చిందన్నారు. ఏడేళ్ల బ్రేక్ తర్వాత ప్రీతీ జింతా మళ్లీ హిందీ సినిమాలో నటించనున్నారు. రాజ్‌కుమార్ సంతోషి తీస్తోన్న లాహోర్ 1947లో ఆమె నటిస్తోంది. అయితే ఇటీవల మహాకుంభమేళాకు వెళ్లిన ఆమె అక్కడ పుణ్యస్నానాలు చేశారు. ఆ తర్వాత వారణాసిలో ఉన్న కాశీ విశ్వేశ్వరుడిని మహాశివరాత్రి నాడు దర్శించుకున్నారు. అయితే సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ప్రీతీకి ప్రశ్న వేశారు. బీజేపీలో చేరుతున్నారా అని ఆమెను అడిగారు.
సోమవారం రాత్రి ఆ ప్రశ్నకు ప్రీతి జింతా బదులిచ్చారు. సోషల్ మీడియా జనంతో ఇదే సమస్య అని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారానే నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. గుడికి వెళ్లినా, కుంభమేళాకు వెళ్లినా.. తన ఐడెంటీ పట్ల గర్వంగా ఫీలవుతున్నానని, దీని ఉద్దేశంతో రాజకీయాల్లో చేరుతున్నట్లు కాదన్నారు. విదేశాల్లో ఉన్న సమయంలో.. భారత దేశ ఔనత్యం తెలిసివచ్చిందన్నారు. అందరి తరహాలోనే తాను కూడా భారత దేశాన్ని అభినందిస్తున్నాన్నారు. విదేశాల్లో జీవిస్తున్న ఓ తల్లిగా.. తన పిల్లలకు భారతీయ విలువలు నేర్పస్తున్నట్లు చెప్పారు. భారతీయ మూలాలు ఉన్న విషయాన్ని మరిచిపోకుండా చేస్తున్నాన్నారు.
ప్రీతీ జింతా ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో తన భర్త జీన్ గుడ్ఎనాఫ్తో కలిసి జీవిస్తున్నారు. ఆమె కవల పిల్లలు గియా, జే కూడా వారితోనే ఉన్నారు. మా పిల్లలను హిందువులుగా పెంచుతున్నామని, కానీ తమపై విమర్శలు వస్తున్నాయని, కొందరు దీన్ని రాజకీయం చేస్తున్నారని, పిల్లలకు వాళ్ల మతం గురించి చెబుతున్నట్లు ఆమె చెప్పారు.
I’m sorry if I sounded abrupt ! I have PTSD from this question. Appreciate your clarification 🙏After becoming a mom & living in a foreign country I wanna make sure my kids don’t forgot they are half Indian. Since my husband is agnostic we are bringing up our kids as Hindus.… https://t.co/ce0pHFKj8H
— Preity G Zinta (@realpreityzinta) April 28, 2025