పాల్వంచ, ఏప్రిల్ 29 : పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని బంగారు జాల గ్రామ శివారు నుంచి అక్రమంగా మట్టిని లారీల్లో లోడ్ చేసి తరలిస్తుండగా పాల్వంచ రెవెన్యూ అధికారులు మంగళవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. మట్టిని తరలిస్తున్నారనే సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు రవికుమార్, హచ్చ సంఘటన స్థలానికి చేరుకుని 6 లారీలు పట్టుకుని తాసీల్దార్ కార్యాలయానికి తరలించారు.
కాగా లారీలను తాసీల్దార్ కార్యాలయానికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మూడు లారీలను సంబంధిత యజమానులు దారిమళ్లించి తీసుకు పోయారు. సంఘటన స్థలంలో ఆయా లారీల ఫొటోలు ముందే తీసుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగి లారీల యజమానుల సమాచారం సేకరించి వాటిని కూడా పట్టుకొచ్చి రెవెన్యూ కార్యాలయంలో ఉంచారు. సంబంధిత యజమానులపై చర్యలు తీసుకుంటామని తాసీల్దార్ వివేక్ తెలిపారు.