Vinesh Phogat | పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ఇప్పటికే ముగిసినా భారత మహిళా రెజర్ల వినేశ్ ఫోగట్ ఇంకా స్వదేశానికి చోరుకోలేదు. వినేశ్ 50 కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరుకోగా.. నిర్దేశించిన పరిమిత బరువు కంటే వంద గ్రాములు అధికంగా ఉండడంతో అనర్హురాలిగా ప్రకటించారు. దాంతో తనకు సంయుక్తంగా సిల్వర్ మెడల్ ఇవ్వాలని కోరుతూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)లో అప్పీల్ చేసింది. అప్పీల్‌పై ఆర్బిట్రేటర్ విచారణ పూర్తి చేయగా.. నిర్ణయం వాయిదాపడుతూ వస్తున్నది. అప్పీల్‌పై నిర్ణయం తీసుకునే వరకు వినేశ్ ఫోగట్ స్వదేశానికి తిరిగి రాకపోవచ్చని సమాచారం. ఫైనల్‌కు ముందు ఎలిమినేషన్‌కు గురైన వినేశ్.. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. భారత ఒలింపిక్ సంఘం (IOA) వివరాల ప్రకారం.. భారత కాలమానం ప్రకారం ఈ నెల 13న మంగళవారం రాత్రి 9.30 గంటలకు అప్పీల్‌పై నిర్ణయం వెలువడాల్సి ఉండగా వాయిదాపడింది.
ఈ నెల 16న నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిపారు. అప్పీల్‌పై ఏదో నిర్ణయం తీసుకునే వరకు వినేశ్ భారత గడ్డపై అడుగుపెట్టకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ.. వినేశ్ ఫోగట్ వ్యవహారంపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. బరువును నియంత్రించుకునే బాధ్యత అథ్లెట్‌తో పాటు కోచ్‌దేనని స్పష్టం చేశారు. ఇందులో వైద్య బృందాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, జూడో తదితర క్రీడల్లో బరువు నియంత్రణ అథ్లెట్లతో పాటు వారి కోచ్‌లపై ఉంటుందని ఉష పేర్కొన్నారు. వినేశ్ సెమీఫైనల్లో క్యూబాకు చెందిన యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్‌ను 5-0తో ఓడించి వినేష్ స్వర్ణ పతకానికి దగ్గరైంది. బంగారు పతకం కోసం యూఎస్‌కు చెందిన సారా ఆన్ హిల్డెబ్రాండ్‌తో పోరుకు సిద్ధమైంది. స్వల్ప బరువు కారణంగా అనర్హత వేటుపడింది. అంతకు ముందు వినేశ్ టోక్యో ఛాంపియన్ జపాన్‌కు చెందిన యుయి సుసాకిని రౌండ్ ఆఫ్ 16లో ఓడించింది.
Morne Morkel: బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్.. ద్రువీకరించిన బీసీసీఐ కార్యదర్శి
Hardik Pandya: బ్రిటీష్ సింగర్‌తో డేటింగ్ చేస్తున్న హార్ధిక్ పాండ్యా !