న్యూఢిల్లీ: భారత క్రికెటర్ హార్ధిక్ పాండ్యా(Hardik Pandya).. బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్లు వస్తున్నాయి.ఆ ఇద్దరూ తాజాగా దిగిన ఫోటో లొకేషన్ ఒకటిగా ఉండడంతో.. వారి మధ్య రొమాన్స్ నడుస్తున్నట్లు ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. ఇటీవలే పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిక్‌కు బ్రేకప్ చెప్పిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల మ్యారేజ్ బాండ్‌కు జూలైలో వాళ్లు వీడ్కోలు పలికారు. అయితే గ్రీస్‌లో ఉన్న ఓ లొకేషన్ నుంచి హార్దిక్‌తో పాటు సింగర్ జాస్మిన్ ఒకే విధమైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సింగర్ జాస్మిన్ .. బ్లూ కలర్ బికినీ.. బ్లూ షర్ట్‌తో .. ఓ పూల్ వద్ద ఫోటో దిగింది. ఆ ఫోటో బ్యాక్‌డ్రాప్‌లో మైకోనస్ సీనరి కనిపిస్తోంది. స్ట్రా హ్యాట్, ఓవర్‌సైజ్ సన్‌గ్లాసెస్‌తో ఆమె దర్శనమిచ్చింది. అయితే అదే పూల్ వద్ద ఉన్న వీడియోను హార్దిక్ పోస్టు చేశాడు. క్రీమ్ కలర్ ప్యాంట్, ప్రింట్ షర్ట్, సన్‌గ్లాసెస్‌తో హార్దిక్ వెరైటీ లుక్‌లో ఉన్నాడు. ఫోటోల్లో ఇద్దరి బ్యాక్‌గ్రౌండ్ మ్యాచ్ కావడంతో.. ఆన్లైన్లో ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు.
బ్రిటీష్ సింగర్, టెవీ పర్సనాల్టీగా జాస్మిన్‌కు గుర్తింపు ఉన్నది. బ్రిటీష్ రియాల్టీ టీవీ సిరీస్ ద ఓన్లీ వే ఈజ్ ఎసెక్స్ లో నటించిన తర్వాత ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మరో వైపు హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా ప్రస్తుతం సెర్బీయాలో ఉన్నది.